Share News

ఆసియా క్రీడల ప్రసార హక్కులను దక్కించుకున్న సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్

ABN , Publish Date - Apr 22 , 2026 | 08:26 PM

ఆసియా క్రీడలు ఐచి-నగోయా 2026 ప్రసార హక్కులను సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా(ఎస్‌పీఎన్ఐ) దక్కించుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌ వేదికగా 20వ ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఆ గేమ్స్ అన్నీ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానళ్లతో పాటు సోనీ లివ్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి.

ఆసియా క్రీడల ప్రసార హక్కులను దక్కించుకున్న సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్
Sony Pictures

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడలు ఐచి-నగోయా 2026 ప్రసార హక్కులను సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా(ఎస్‌పీఎన్ఐ) దక్కించుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌ వేదికగా 20వ ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఆ గేమ్స్ అన్నీ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానళ్లతో పాటు సోనీ లివ్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. గత ఆసియా క్రీడలలో భారత్ 107 పతకాలను సాధించి, టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ టోర్నీతో అంచనాలు రెట్టింపు అయ్యాయి.


క్రికెట్, టెన్నిస్, ఈ-స్పోర్ట్స్, కబడ్డీ, సెపక్ తక్రా, కురాష్ వంటి ప్రధాన క్రీడలతో పాటు.. 32 ఒలింపిక్ ఆటలు కలిపి మొత్తంగా 41 క్రీడలు ఉండనున్నాయి. వీటిల్లో అగ్రశేణి క్రీడాకారులు పాల్గొంటారు. ఈ ఎడిషన్‌లో క్రికెట్ ప్రధానంగా హైలైట్ కానుంది. దేశవ్యాప్తంగా లక్షల మందికి స్ఫూర్తినిచ్చే క్రీడా సమరాన్ని సమగ్రంగా అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పోర్ట్స్ అండ్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ బిజినెస్ హెడ్ రాజేశ్ కౌల్, డైరెక్టర్ జనరల్-ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా హుస్సేన్ అల్ ముసల్లం ఒక ప్రకటనలో తెలిపారు.


ఇవి కూడా చదవండి:

డ్రగ్స్ టెస్టులో పాజిటివ్.. పాక్ క్రికెటర్‌ కాంట్రాక్ట్ రద్దు చేసిన పీసీబీ

భారత లీగ్‌లో ఆడినందుకు ఆసీస్ మాజీ ప్లేయర్‌పై వేటు

Updated Date - Apr 22 , 2026 | 08:26 PM