Share News

ఐపీఎల్ 2026: సీఎస్కేతో మ్యాచ్.. టాస్ నెగ్గిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్

ABN , Publish Date - May 15 , 2026 | 07:17 PM

ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఎల్ఎస్‌జీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.

ఐపీఎల్ 2026: సీఎస్కేతో మ్యాచ్.. టాస్ నెగ్గిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్
LSG vs CSK

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఎల్ఎస్‌జీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. 11 మ్యాచుల్లో ఆరు విజయాలతో సీఎస్కే పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. గురువారం ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ ఓడిపోవడంతో.. సీఎస్కే ప్లే ఆఫ్స్ ఆశలు మరింత మెరుగయ్యాయి. నేటి మ్యాచ్‌లో లఖ్‌నవూను ఓడించగలిగితే.. చెన్నై నాలుగో స్థానానికి ఎగబాకుతుంది. ఇదిలా ఉంటే, పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న ఎల్ఎస్‌జీ.. ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.


సీఎస్కే తుది జట్టు

రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), సంజు శాంసన్(వికెట్ కీపర్), ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ, డేవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబె, ప్రశాంత్ వీర్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, జాన్సన్, ముకేశ్ చౌదరి

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: గుర్జాప్‌నీత్ సింగ్, అకీల్ హుస్సేన్, సర్ఫరాజ్ ఖాన్, మ్యాథ్యూ షార్ట్, మ్యాట్ హెన్రీ


ఎల్ఎస్‌జీ తుది జట్టు

రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, మార్క్‌రమ్, ముకుల్ చౌదరి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, షమి, మయాంక్ యాదవ్, ఆకాశ్ మహారాజ్ సింగ్, ప్రిన్స్ యాదవ్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: జోస్ ఇంగ్లిస్, మానిమారన్ సిద్ధార్థ్, దిగ్వేశ్ సింగ్ రాఠి, హిమ్మత్ సింగ్, ఆయుశ్ బదోని


ఇవి కూడా చదవండి:

ప్లే ఆఫ్స్‌కు ముందు కేకేఆర్‌కు షాక్.. ఐపీఎల్‌ను వీడిన రచిన్ రవీంద్ర

కెప్టెన్‌గా సంజు టీమిండియాను ఉత్తమంగా నడిపించగలడు: రవి శాస్త్రి

Updated Date - May 15 , 2026 | 07:17 PM