ఇషాన్ కిషన్‌కు రూ. కోటి నజరానా
ABN , Publish Date - May 15 , 2026 | 05:24 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను బిహార్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్‌కు.. బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరీ రూ. కోటి నజరానా ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను బిహార్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్‌కు.. బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరీ రూ.కోటి నజరానా ప్రకటించారు. సీఎం నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఇషాన్‌కు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సమ్రాట్ చౌదరీ సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకున్నారు.
అనివార్య కారణాల వల్ల ఇషాన్ కిషన్ చాలా కాలం భారత జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దేశవాళీ క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చి.. అక్కడ అద్భుతంగా రాణించి టీమిండియాలో తిరిగి చోటు సంపాదించుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు జట్టులో చేరాడు. టోర్నీలో అద్భుత ప్రదర్శనతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల్లో 317 పరుగులు చేసి భారత్ తరఫున రెండో అత్యధిక రన్స్ సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ప్రత్యేకంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 40 బంతుల్లో 77 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. ఫైనల్‌లో 25 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు. ఫైనల్ మ్యాచ్‌కు ముందురోజు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తన కజిన్ సిస్టర్‌కు ఆ విజయాన్ని అంకితం ఇచ్చాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న ఇషాన్.. 12 మ్యాచ్‌ల్లో 420 పరుగులు చేసి మంచి ఫామ్‌లో కొనసాగుతున్నాడు.
ఇవి కూడా చదవండి:
ప్లే ఆఫ్స్‌కు ముందు కేకేఆర్‌కు షాక్.. ఐపీఎల్‌ను వీడిన రచిన్ రవీంద్ర
కెప్టెన్‌గా సంజు టీమిండియాను ఉత్తమంగా నడిపించగలడు: రవి శాస్త్రి