ఐపీఎల్ 2026: లఖ్‌నవూ ఓపెనర్ల ఊచకోత.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్
ABN , Publish Date - May 19 , 2026 | 09:33 PM
ఐపీఎల్ 2026లో మరో భారీ స్కోర్ నమోదైంది. జైపూర్ వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎల్ఎస్‌జీ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. రాజస్థాన్‌కు 221 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో మరో భారీ స్కోర్ నమోదైంది. జైపూర్ వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎల్ఎస్‌జీ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. రాజస్థాన్‌కు 221 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. లఖ్‌నవూ ఓపెనర్లు మిచెల్ మార్ష్(96; 57 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లు), జోస్ ఇంగ్లిస్(60; 29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ కలిసి 50 బంతుల్లోనే 109 పరుగులు జోడించారు.
ఆఖరి ఓవర్లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో రిషబ్ పంత్(35; 23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిచెల్ మార్ష్(96) వెనువెంటనే రనౌట్ అయ్యారు. మార్ష్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. నికోలస్ పూరన్(16), ఆయుశ్ బదోని(0) నిరాశపర్చారు. అబ్దుల్ సమద్(0*) నాటౌట్‌గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో యశ్ రాజు పుంజా 2, జోఫ్రా ఆర్చర్ 1 వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
సీఎస్కేకి కెప్టెన్సీ చేయడం అంత సులభం కాదు: అశ్విన్
వచ్చే సీజన్‌లోనైనా ధోని ఆడుతాడా? సీఎస్కే కోచ్ రియాక్షన్ ఇదే