ఐపీఎల్ 2026: లఖ్‌నవూతో పోరు.. టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్
ABN , Publish Date - May 19 , 2026 | 07:15 PM
ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన రాజస్థాన్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత లఖ్‌నవూ బ్యాటింగ్‌కు దిగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన రాజస్థాన్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత లఖ్‌నవూ బ్యాటింగ్‌కు దిగనుంది. 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న ఆర్ఆర్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఇందులో విజయం సాధిస్తే 14 పాయింట్లతో టాప్ 4కి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో యశస్వి జైస్వాల్ జట్టును నడిపించనున్నాడు. ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారిన తరుణంలో ఆర్ఆర్ జట్టు లఖ్‌నవూపై నెగ్గుతుందో? లేదో? చూడాల్సి ఉంది. కాగా ఈ టోర్నీ నుంచి ఎల్ఎస్‌జీ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు
యశస్వి జైస్వాల్(కెప్టెన్), ప్రిటోరియస్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), డొనొవాన్ ఫెర్రీరా, శుభమ్ దూబె, డాసున్ శనక, జోఫ్రా ఆర్చర్, సుశాంత్ మిశ్రా, సందీప్ శర్మ, బ్రిజేశ్ శర్మ, యశ్ రాజ్ పుంజా
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: వైభవ్ సూర్యవంశీ, యుధ్విర్ సింగ్, అమన్ రావు పెరాలా, రవి బిష్ణోయ్, రియాన్ పరాగ్
ఎల్ఎస్‌జీ తుది జట్టు
రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, జోస్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, ఆయుశ్ బదోని, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, ఆకాశ్ మహరాజ్ సింగ్, ప్రిన్స్ యాదవ్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: ముకుల్ చౌదరి, మానిమారన్ సిద్ధార్థ్, దిగ్వేశ్ సింగ్ రాఠి, హిమ్మత్ సింగ్, కులకర్ణి
ఇవి కూడా చదవండి:
అఫ్గానిస్థాన్‌తో సిరీస్: భారత వన్డే, టెస్టు జట్ల ప్రకటన
సీఎస్కేకి ఇంకా ప్లే ఆఫ్స్ ఛాన్స్.. అలా జరగడం సాధ్యమేనా?