Share News

అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌: భారత వన్డే, టెస్టు జట్ల ప్రకటన

ABN , Publish Date - May 19 , 2026 | 04:51 PM

అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు వచ్చే నెలలో భారత పర్యటనకు రానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా అఫ్గాన్‌తో ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇందుకోసం బీసీసీఐ భారత వన్డే, టెస్టు జట్లను ప్రకటించింది.

అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌: భారత వన్డే, టెస్టు జట్ల ప్రకటన
India vs Afghanistan series

ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు వచ్చే నెలలో భారత పర్యటనకు రానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా అఫ్గాన్‌తో ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇందుకోసం బీసీసీఐ భారత వన్డే, టెస్టు జట్లను ప్రకటించింది. టెస్టు, వన్డే జట్లకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కొన్ని నెలలుగా తీరిక లేకుండా క్రికెట్ ఆడుతున్న స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ విశ్రాంతినిచ్చింది. గత కొంత కాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు వన్డేల్లో అవకాశం దక్కలేదు. వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నారు. అయితే ఐపీఎల్ సందర్భంగా గాయపడ్డ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యకు జట్టులో చోటిచ్చారు. కానీ మ్యాచ్ సమయానికి ఫిట్‌నెస్ ఆధారంగానే తుది జట్టులో ఉండాలో? లేదో? నిర్ణయిస్తామని బీసీసీఐ తెలిపింది. మరోవైపు ఐపీఎల్ 2026లో సత్తా చాటుతున్న యువ ప్లేయర్లకు కూడా బీసీసీఐ జట్టులో అవకాశం ఇచ్చింది.


భారత వన్డే జట్టు:

శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్య, ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబె, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, గుర్‌నూర్ బ్రార్

భారత టెస్ట్ జట్టు:

శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, హర్ష్ దూబె, బ్రార్


ఇవి కూడా చదవండి:

సీఎస్కేకి కెప్టెన్సీ చేయడం అంత సులభం కాదు: అశ్విన్

వచ్చే సీజన్‌లోనైనా ధోని ఆడుతాడా? సీఎస్కే కోచ్ రియాక్షన్ ఇదే

Updated Date - May 19 , 2026 | 04:51 PM