ఐపీఎల్ 2026: ముస్తాఫిజుర్ రెహమాన్ స్థానంలో జింబాబ్వే స్టార్ ప్లేయర్
ABN , Publish Date - Mar 13 , 2026 | 08:25 PM
కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్-భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. తాజాగా అతడి ప్లేస్‌లో జింబాబ్వే పేస్ సంచలనం బ్లెస్సింగ్ ముజరబానీని తీసుకున్నట్లు ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 సమరం ప్రారంభం కానుంది. మార్చి 28న ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్-భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. తాజాగా అతడి ప్లేస్‌లో జింబాబ్వే పేస్ సంచలనం బ్లెస్సింగ్ ముజరబానీని తీసుకున్నట్లు ప్రకటించింది.
పీఎస్ఎల్ కాంట్రాక్ట్‌కు గుడ్ బై
ముజరబానీ ఐపీఎల్ ఆడేందుకు ఇస్లామాబాద్ యునైటెడ్‌తో ఉన్న తన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. దీంతో పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను వదిలి ఐపీఎల్‌కు వచ్చిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ‘6 అడుగుల 8 అంగుళాల ఎత్తు ఉన్న ముజరబానీ పొట్టి ఫార్మాట్‌లో జింబాబ్వేకు ప్రధాన పేసర్లలో ఒకడు. అతని వేగం, బౌన్స్, కీలక సమయాల్లో వికెట్లు తీయగల సామర్థ్యం జట్టుకు ఉపయోగపడుతుంది’ అని కేకేఆర్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ముజరబానీ ఇప్పటి వరకు 80కు పైగా టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడి.. 90కి పైగా వికెట్లు తీసుకున్నాడు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ 2026లో అద్భుత బౌలింగ్‌తో 13 వికెట్లు తీసి ఔరా అనిపించాడు.
గతంలో కూడా ఇదే వివాదం
గతేడాది దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ కూడా ఇదే తరహాలో పీఎస్ఎల్ కాంట్రాక్ట్‌ను వదిలి ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. ఈ నిర్ణయం అప్పట్లో పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ తరహా ఘటనలపై పాక్ క్రికెట్ బోర్డ్ కఠిన చర్యలు తీసుకుంటుంది. కాంట్రాక్ట్ ఉల్లంఘన చేసే ఆటగాళ్లను తదుపరి పీఎస్ఎల్ సీజన్‌కు అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి:
సన్‌రైజర్స్ లీడ్స్‌లో పాక్ ప్లేయర్.. బీసీసీఐ రియాక్షన్ ఇదే
కోహ్లీ ఆడుతున్న ప్రతి మ్యాచులోనూ తనదైన ముద్ర వేస్తాడు: ఇర్ఫాన్ పఠాన్