ఫుట్‌బాల్ ఆడుతూ మైదానంలోనే కుప్పకూలిన యువ ప్లేయర్
ABN , Publish Date - Mar 13 , 2026 | 06:43 PM
భారత ఫుట్‌బాల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఫుట్‌బాల్ ఆడుతూ పాతికేళ్ల యువ ప్లేయర్ మైదానంలోనే కుప్పకూలాడు. ఈ ఘటన పంజాబ్‌లోని లుధియానా జిల్లా మాజ్రి గ్రామంలో చోటు చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత ఫుట్‌బాల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఫుట్‌బాల్ ఆడుతూ పాతికేళ్ల యువ ప్లేయర్ మైదానంలోనే కుప్పకూలాడు. ఈ ఘటన పంజాబ్‌లోని లుధియానా జిల్లా మాజ్రి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక ఫుట్‌బాల్ మ్యాచులో ఆడుతుండగా ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో రవీందర్ సింగ్(25) అక్కడికక్కడే మరణించాడు.
రవీందర్ సింగ్ ప్రస్తుతం ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్‌లోని నాంధారి ఫుట్‌బాల్ క్లబ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. అయితే అతడు ఘర్షంకర్‌లోని బబ్బర్ అకాలీ మొమోరియల్ ఖల్సా కాలేజిలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. రవీందర్ సింగ్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు సహా స్నేహితులు, ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్‌కు చెందిన పలు క్లబ్‌ల ప్లేయర్లు హాజరయ్యారు. ‘మా ఫుట్‌బాల్ క్లబ్‌లో భాగమైన రవీందర్ సింగ్ మరణించడం బాధాకరం. ఎంతో భవిష్యత్తు ఉన్న అతడు 25 ఏళ్లకే మృతి చెందడం కలిచివేస్తోంది. అతడి అకాల మరణం ఫుట్‌బాల్ ఫ్యామిలీకి తీరని లోటు. రవీందర్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని నాంధారి ఫుట్‌బాల్ క్లబ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.
ఇవి కూడా చదవండి:
సన్‌రైజర్స్ లీడ్స్‌లో పాక్ ప్లేయర్.. బీసీసీఐ రియాక్షన్ ఇదే
కోహ్లీ ఆడుతున్న ప్రతి మ్యాచులోనూ తనదైన ముద్ర వేస్తాడు: ఇర్ఫాన్ పఠాన్