Share News

అబ్రార్ ఒక్కడే కాదు.. భారత ఫ్రాంచైజీల్లో మరికొందరు పాక్ ప్లేయర్లు

ABN , Publish Date - Mar 13 , 2026 | 05:40 PM

ఇంగ్లండ్‌లో జరిగే ‘ది హండ్రెడ్‌ లీగ్‌2026’ వేలంలో పాకిస్థా‌న్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ను కావ్యా మారన్‌ నేతృత్వంలో‌ని సన్‌రైజర్స్‌ లీడ్స్‌ కొనుగోలు చేయడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

అబ్రార్ ఒక్కడే కాదు.. భారత ఫ్రాంచైజీల్లో మరికొందరు పాక్ ప్లేయర్లు
Abrar Ahmed Sunrisers Leeds controversy

స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్‌లో జరిగే ‘ది హండ్రెడ్‌ లీగ్‌(The Hundred League 2026 )’ వేలంలో పాకిస్థా‌న్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ను కావ్యా మారన్‌ నేతృత్వంలో‌ని సన్‌రైజర్స్‌ లీడ్స్‌ కొనుగోలు చేయడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆసియా కప్2025లో భాగంగా భారత్‌తోజరిగిన మ్యాచ్‌లో 'ఆపరేషన్‌ సిందూర్‌'ను కించపరిచే విధంగా వ్యవహరించిన అబ్రార్‌ కోసం సన్‌రైజర్స్‌ రూ. 2.34 కోట్లు వెచ్చించడంతో.. భారతీయ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరమీదకు వచ్చింది.


సన్‌రైజర్స్‌ తాజాగా విదేశీ లీగ్‌లో పాక్‌ ఆటగాడిని ఎంచుకోగా.. ఇంతకు ముందే పలు భారత ఫ్రాంచైజీలు పాక్‌ ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ట్రిన్ బాగ్ నైట్ రైడర్స్ తరఫున పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ మహ్మద్ ఆమిర్, స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ ఆడారు. ట్రిన్ బాగ్ నైట్ రైడర్స్ జట్టుకు ఐపీఎల్ ఫ్రాంచైజీ కేకేఆర్ యజమానులైన షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా, జై మెహతానే ఓనర్లు కావడం గమన్హారం.


అలానే అమెరికాలో జరిగే మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో గతేడాది సీటెల్‌ ఆర్కాస్‌ జట్టుకు పాక్‌ ఆల్‌రౌండర్‌ ఇమాద్‌ వసీం ప్రాతినిథ్యం వహించాడు. ఈ జట్టు ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యంలో భాగమైన జీఎంఆర్ గ్రూప్‌నకు చెందినది. ఇంటర్నేషనల్ లీగ్ టీ20(ILT20) 2023-24 సీజన్‌లో కేకేఆర్‌కు చెందిన అబుదాబి ఫ్రాంచైజీకి ఇమాద్‌ వసీం ఆడాడు. అలానే మరో పాక్‌ క్రికెటర్‌ ఉస్మాన్‌ ఖాన్‌ 2025 ఐఎల్ టీ20 సీజన్‌లో.. ముంబై ఇండియన్స్‌కు చెందిన ఎంఐ ఎమిరేట్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.


ఇవి కూడా చదవండి:

సన్‌రైజర్స్ లీడ్స్‌లో పాక్ ప్లేయర్.. బీసీసీఐ రియాక్షన్ ఇదే

కోహ్లీ ఆడుతున్న ప్రతి మ్యాచులోనూ తనదైన ముద్ర వేస్తాడు: ఇర్ఫాన్ పఠాన్

Updated Date - Mar 13 , 2026 | 05:43 PM