యువీతో ప్రాక్టీస్ సెషన్.. పంత్ కెరీర్‌కు ప్లస్ అవుతుందా?
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:29 PM
ఐపీఎల్ 2026 నేపథ్యంలో టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ పర్యవేక్షణలో ముంబైలో స్టార్ బ్యాటర్ పంత్ ప్రాక్టీస్ చేశాడు. ఇద్దరూ కలిసి నాలుగు రోజుల పాటు బ్రబౌర్న్ స్టేడియంలో ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. యువీ.. పంత్‌కు బ్యాటింగ్‌లో కీలకమైన సూచనలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, ప్రభుసిమ్రన్ సింగ్... ఇలా పలు భారత క్రికెటర్లు ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్నారు. మరి వీరికి మెంటార్, కోచ్ లేదా శిక్షణ ఇచ్చి రాటుదేలేలా చేసింది ఎవరో తెలుసా? టీమిండియా క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్. ప్రస్తుతం ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా ఈ జాబితాలోకి చేరిపోయాడు.
పునరాగమనం చేస్తాడా..?
ఐపీఎల్ 2026 నేపథ్యంలో యువీ పర్యవేక్షణలో ముంబైలో పంత్ ప్రాక్టీస్ చేశాడు. యువరాజ్ సింగ్, రిషభ్ పంత్ కలిసి నాలుగు రోజుల పాటు బ్రబౌర్న్ స్టేడియంలో ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. యువీ.. పంత్‌కు బ్యాటింగ్‌లో కీలకమైన సూచనలు చేశాడు. బౌలర్లు సంధించిన బంతుల్ని యువీ పర్యవేక్షణలో పంత్ షాట్లు ఆడాడు. పంత్ గత కొంతకాలంగా వైట్ బాల్ క్రికెట్‌లో పెద్దగా రాణించడం లేదు. ఈ నేపథ్యంలో యువీతో ట్రైనింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది. అభిషేక్ శర్మ, గిల్ వంటి ప్లేయర్లకు అద్భుతమైన ట్రైనింగ్ ఇచ్చి రాటు దేలేలా చేసిన యువీ.. పంత్‌ను కూడా ఆ స్థాయిలో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. యువీతో ప్రాక్టీస్ సెషన్.. పంత్ కెరీర్‌కు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఐపీఎల్‌లో రాణించి తిరిగి టీమిండియాలో పునరాగమనం చేయాలనే తపనతో ఉన్నాడు.
యువీతో ప్రాక్టీస్ సెషన్ ముగిశాక పంత్ చెన్నైలోని లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ క్యాంప్‌నకు హాజరయ్యాడు. ఈ క్యాంప్‌ను బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ లాన్స్ క్లూసెనర్ పర్యవేక్షించారు. ఆయుష్ బదోని, మొహ్సిన్ ఖాన్, హిమ్మత్ సింగ్, దిగ్వేశ్ సింగ్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ తదితరులు హాజరవుతున్నారు. మార్చి 15 తర్వాత ఈ శిబిరం లఖ్‌నవూకు మారనుంది. ఏప్రిల్ 1న లఖ్‌నవూ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
ఇవి కూడా చదవండి:
సన్‌రైజర్స్ లీడ్స్‌లో పాక్ ప్లేయర్.. బీసీసీఐ రియాక్షన్ ఇదే
కోహ్లీ ఆడుతున్న ప్రతి మ్యాచులోనూ తనదైన ముద్ర వేస్తాడు: ఇర్ఫాన్ పఠాన్