Share News

ఐపీఎల్ 2026: కార్తిక్ శర్మ హాఫ్ సెంచరీ..లఖ్‌నవూ టార్గెట్ ఎంతంటే?

ABN , Publish Date - May 15 , 2026 | 09:33 PM

ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. ఎల్ఎస్‌జీకి 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2026: కార్తిక్ శర్మ హాఫ్ సెంచరీ..లఖ్‌నవూ టార్గెట్ ఎంతంటే?
IPL 2026

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. ఎల్ఎస్‌జీకి 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కార్తిక్ శర్మ(71; 42 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఎల్ఎస్‌జీ బౌలర్ల ఆకాశ్ సింగ్ ఐపీఎల్ అరంగ్రేటం మ్యాచ్‌లోనే 3 వికెట్లతో చెలరేగాడు.


సంజు శాంసన్(20), రుతురాజ్ గైక్వాడ్(13), ఉర్విల్ పటేల్(6), బ్రెవిస్(25) విఫలమయ్యారు. శివం దూబె(32*; 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రశాంత్ వీర్(13*; 10 బంతుల్లో 1 ఫోర్) నాటౌట్‌గా నిలిచారు. ఎల్ఎస్‌జీ బౌలర్లలో ఆకాశ్ సింగ్ 3, షమి 1, షాబాజ్ అహ్మద్ 1 వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

ప్లే ఆఫ్స్‌కు ముందు కేకేఆర్‌కు షాక్.. ఐపీఎల్‌ను వీడిన రచిన్ రవీంద్ర

కెప్టెన్‌గా సంజు టీమిండియాను ఉత్తమంగా నడిపించగలడు: రవి శాస్త్రి

Updated Date - May 15 , 2026 | 09:33 PM