Share News

ఐపీఎల్ 2026: రికార్డు స్థాయిలో 110 కోట్ల వ్యూస్

ABN , Publish Date - May 15 , 2026 | 09:01 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రేక్షకాదరణలో మరోసారి కొత్త రికార్డుల దిశగా దూసుకెళుతోంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వ్యూయర్‌షిప్ ఈ సీజన్‌లోనే రావడం విశేషం.

ఐపీఎల్ 2026: రికార్డు స్థాయిలో 110 కోట్ల వ్యూస్
IPL 2026

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రేక్షకాదరణలో మరోసారి కొత్త రికార్డుల దిశగా దూసుకెళుతోంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వ్యూయర్‌షిప్ ఈ సీజన్‌లోనే రావడం విశేషం. టీవీ, డిజిటల్ వేదికల్లో వ్యూస్‌లో భారీ పెరుగుదల కనిపించింది. రెండు ప్లాట్‌ఫామ్‌ల్లో 110 కోట్ల వ్యూస్ వచ్చినట్లు జియో హాట్‌స్టార్ వెల్లడించింది. టీవీ వ్యూయర్‌షిప్ 50 కోట్ల మార్క్‌ను తాకింది. ఇటు డిజిటల్ విభాగంలో 15 శాతం వృద్ధి నమోదు చేసినట్లు జియో వెల్లడించింది. ఇందులో మ్యాచ్‌లను వీక్షించిన సమయం 7 శాతం పెరిగిందని తెలిపింది. ప్రాంతీయ భాషల్లోనూ 42 శాతం పెరగడం గమనార్హం. ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.


‘ఐపీఎల్ 2026 సీజన్‌ను అభిమానులు భారీగా ఆదరిస్తున్నారనేందుకు ఇదొక తార్కాణం. లీగ్ స్టేజ్‌లో ఇంకా మ్యాచ్‌లు ఉన్నాయి. ప్రతివారం పోటీల్లో తీవ్రత పెరుగుతోంది. ఫ్యాన్స్ పెద్దఎత్తున చూస్తున్నారు. ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారుతున్న వేళ.. జియోస్టార్ ప్రతిదానిని అభిమానులకు చేరువ చేసేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటుంది’ అని జియోస్టార్ సేల్స్ హెడ్ అనుప్ గోవిందన్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

ప్లే ఆఫ్స్‌కు ముందు కేకేఆర్‌కు షాక్.. ఐపీఎల్‌ను వీడిన రచిన్ రవీంద్ర

కెప్టెన్‌గా సంజు టీమిండియాను ఉత్తమంగా నడిపించగలడు: రవి శాస్త్రి

Updated Date - May 15 , 2026 | 09:20 PM