Share News

ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్?

ABN , Publish Date - Mar 17 , 2026 | 06:32 AM

ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్ ఎవరనే విషయంపై అనిశ్చితి కొనసాగుతోంది. తాజాగా జట్టు పగ్గాలు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్?
Ishan Kishan

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్ ఎవరనే విషయంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు చేపట్టిన ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆరంభ మ్యాచ్‌లకు మాత్రమే అతడు దూరమవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కమిన్స్ ఐపీఎల్‌కు పూర్తిగా అందుబాటులో ఉంటాడా? అతడు దూరమైతే జట్టును నడిపించేది ఎవరు? అనే అంశం ఆసక్తికరంగా మారింది.


నిరుడు వెస్టిండీస్‌తో టెస్టు మ్యాచ్‌లో వెన్ను గాయానికి గురైన కమిన్స్.. ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో ఒక్క టెస్టు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత టీ20 ప్రపంచ కప్ టోర్నీకి కూడా దూరమయ్యాడు. ఐపీఎల్ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు అతడు దూరమవ్వొచ్చని సమాచారం. అతడి స్థానంలో ట్రావిస్ హెడ్ లేదా అభిషేక్ శర్మ తాత్కాలిక కెప్టెన్‌గా ఉండే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జట్టు పగ్గాలు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇషాన్ తన సారథ్యంలో తొలిసారి ఝార్ఖండ్‌ను విజేతగా నిలిపాడు. 2016 అండర్ 19 ప్రపంచ కప్‌లోనూ కెప్టెన్‌గా ఉన్నాడు. భారత్ టీ20 ప్రపంచ కప్‌ నెగ్గడంలోనూ ఇషాన్ 317 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. కాగా అతడిని ఎస్ఆర్‌హెచ్ 2025 మెగా వేలంలో రూ.11.25 కోట్లకు దక్కించుకుంది. మరోవైపు అభిషేక్ శర్మ కూడా 2016 అండర్ 19 ఆసియా కప్‌లో ఇండియాకు కెప్టెన్‌గా చేశాడు. దీనిపై ఎస్ఆర్‌హెచ్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లు.. కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

న్యూజిలాండ్‌కు మరో భారీ ఎదురు దెబ్బ!

Updated Date - Mar 17 , 2026 | 06:34 AM