Share News

ఆయుష్‌పై అంచనాలు

ABN , Publish Date - Mar 17 , 2026 | 06:08 AM

వర్ధమాన షట్లర్లు ఆయుష్‌ శెట్టి, తన్వీ శర్మ మంగళవారం నుంచి జరిగే ఓర్లీన్స్‌ మాస్టర్స్‌లో సత్తా చాటాలనుకొంటున్నారు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో లి చియా హో (చైనీస్‌ తైపీ)తో...

ఆయుష్‌పై అంచనాలు

ఓర్లీన్స్‌ మాస్టర్స్‌ నేటి నుంచే

  • బరిలో తరుణ్‌, కిడాంబి

  • గాయంతో ప్రణయ్‌ దూరం

ఓర్లీన్స్‌ (ఫ్రాన్స్‌): వర్ధమాన షట్లర్లు ఆయుష్‌ శెట్టి, తన్వీ శర్మ మంగళవారం నుంచి జరిగే ఓర్లీన్స్‌ మాస్టర్స్‌లో సత్తా చాటాలనుకొంటున్నారు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో లి చియా హో (చైనీస్‌ తైపీ)తో ఎనిమిదో సీడ్‌ ఆయుష్‌ తలపడనున్నాడు. గతేడాది యూఎస్‌ ఓపెన్‌ నెగ్గిన ఆయు్‌షపై భారీ అంచనాలున్నాయి. తరుణ్‌ మన్నేపల్లి, కిరణ్‌ జార్జ్‌ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకొంటున్నారు. అయితే, సీనియర్‌ షట్లర్‌ హెచ్‌ఎ్‌స ప్రణయ్‌ భుజం గాయంతో తప్పుకోగా.. మాజీ వరల్డ్‌ నెం:1 కిడాంబి శ్రీకాంత్‌ మొదటి రౌండ్‌లో మాగ్నస్‌ జొనాసెన్‌ (డెన్మార్క్‌)తో ఆడనున్నాడు. మహిళల సింగిల్స్‌లో తన్వీతోపాటు మాళవిక బన్సోడ్‌, అన్‌మోల్‌ కర్బ్‌, ఇస్రానీ బా రువా, రక్షిత శ్రీ ఆడనున్నారు. డబుల్స్‌లో ఎంఆర్‌ అర్జున్‌-హరిహరన్‌, శిఖా గౌతమ్‌-అశ్విని భట్‌.. మిక్స్‌డ్‌లో రోహన్‌ కపూర్‌-రుత్వికశివాని, ధ్రువ్‌ కపిల-తనీషా క్రాస్టో జంటలు బరిలో దిగనున్నాయి.

ఇవి కూడా చదవండి:

అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లు.. కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

న్యూజిలాండ్‌కు మరో భారీ ఎదురు దెబ్బ!

Updated Date - Mar 17 , 2026 | 06:24 AM