Share News

అబ్రార్‌కు డబ్బిచ్చారంటే.. భారతీయులను చంపుతున్నట్టే..

ABN , Publish Date - Mar 17 , 2026 | 06:11 AM

పాకిస్థాన్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ను ‘ద హండ్రెడ్‌’ లీగ్‌ ఫ్రాంచైజీ ‘సన్‌రైజర్స్‌ లీడ్స్‌’ వేలంలో కొనుగోలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఐపీఎల్‌ జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌...

అబ్రార్‌కు డబ్బిచ్చారంటే.. భారతీయులను చంపుతున్నట్టే..

కావ్యా మారన్‌పై గవాస్కర్‌ ఫైర్‌

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ను ‘ద హండ్రెడ్‌’ లీగ్‌ ఫ్రాంచైజీ ‘సన్‌రైజర్స్‌ లీడ్స్‌’ వేలంలో కొనుగోలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఐపీఎల్‌ జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యజమాని కావ్యా మారన్‌దే సన్‌రైజర్స్‌ లీడ్స్‌ జట్టు కావడంతో ఆమెపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దిగ్గజ బ్యాటర్‌ సునీల్‌ గవాస్కర్‌ కూడా కావ్యా మారన్‌ చర్యను తీవ్రంగా వ్యతిరేకించాడు. పాకిస్థాన్‌ లెగ్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ను కొనుక్కోవడమంటే.. అది పరోక్షంగా భారత్‌కు హాని చేయడమేనని గవాస్కర్‌ వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్‌ ఆటగాళ్లకు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బు అంతిమంగా ఆ దేశానికి పన్నుల రూపంలో చేరతాయని గవాస్కర్‌ వాదించాడు. ‘పాక్‌ క్రికెటర్లకు చెల్లించే మొత్తంలో కొంత ఆ దేశానికి పన్నుల రూపంలో అందుతుంది. అలా వచ్చే మొత్తంతో ఆ దేశం ఆయుధాలు కొనుగోలు చేస్తుంది. ఆ ఆయుధాలతో భారత సైనికులను, పౌరులను చంపుతుంది’ అని ఇంగ్లండ్‌లోని ఓ పత్రికకు రాసిన వ్యాసంలో గవాస్కర్‌ దుయ్యబట్టాడు. ‘ఆ ఫ్రాంచైజీ యజమాని భారతీయుడైతే..భారతీయుల మరణానికి ఆ యజమాని కారణమవుతున్నట్టే’ అని స్పష్టంజేశాడు. ‘జాతీయ భావోద్వేగా’నికంటే ఫ్రాంచైజీ టోర్నమెంట్‌లో విజయం ముఖ్యమా? అని కావ్యా మారన్‌ను గవాస్కర్‌ నిలదీశాడు.

ఇవి కూడా చదవండి:

అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లు.. కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

న్యూజిలాండ్‌కు మరో భారీ ఎదురు దెబ్బ!

Updated Date - Mar 17 , 2026 | 06:11 AM