Share News

ఐపీఎల్ 2026: తడబడిన గుజరాత్ బ్యాటర్లు.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?

ABN , Publish Date - May 31 , 2026 | 09:26 PM

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2026 ఫైనల్ పోరు జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేశారు.

ఐపీఎల్ 2026: తడబడిన గుజరాత్ బ్యాటర్లు.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?
RCB vs GT

ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2026 ఫైనల్ పోరు జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. జీటీ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్(50*) హాఫ్ సెంచరీతో రాణించాడు. అతడు మినహా మిగతా బ్యాటర్లంతా తీవ్రంగా విఫలమయ్యారు.


సాయి సుదర్శన్(12), శుభ్‌మన్ గిల్(10), నిశాంత్ సింధు(20), బట్లర్(19), అర్షద్ ఖాన్(15), రాహుల్ తెవాటియా(7), హోల్డర్(7), రషీద్ ఖాన్(7) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. సుందర్(50*), రబాడా(3*) నాటౌట్‌గా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ దార్ 3, హేజిల్‌వుడ్ 2, భువనేశ్వర్ కుమార్ 2, కృనాల్ పాండ్య 1 వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

ఇషాన్ కిషన్‌ను దాటి అత్యధిక ధర పలికిన ఎంఐ ప్లేయర్

ఐపీఎల్ ఫైనల్‌: కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Updated Date - May 31 , 2026 | 09:43 PM