ముక్కోణపు సిరీస్: భారత్-ఎ జట్టు వైస్ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్
ABN , Publish Date - May 31 , 2026 | 07:42 PM
శ్రీలంకలో ముక్కోణపు సిరీస్‌కు భారత్-ఎ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన రియాన్ పరాగ్ గాయంతో దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో స్టార్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్‌కు బీసీసీఐ చోటు కల్పించింది.
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకలో ముక్కోణపు సిరీస్‌కు భారత్-ఎ జట్టు వైస్ కెప్టెన్‌గా యువ బ్యాటర్ రియాన్ పరాగ్ ఎంపికైన సంగతి తెలిసిందే. తాజాగా తొడ కండరాల గాయంతో పరాగ్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో స్టార్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్‌కు బీసీసీఐ చోటు కల్పించింది. దాంతోపాటు వైస్ కెప్టెన్ బాధ్యతలనూ అప్పగించింది. జూన్ 9 నుంచి ప్రారంభం కానున్న ఈ ముక్కోణపు సిరీస్‌లో భారత్-ఎ, శ్రీలంక-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్లు తలపడనున్నాయి. ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నింటికీ శ్రీలంకలోని దంబుల్లా ఆతిథ్యమివ్వనుంది.
ఐపీఎల్ 2026లో రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. టోర్నీ మొత్తాన్ని అతడు కండరాల గాయంతోనే ఆడాడు. ఇప్పుడు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో ముక్కోణపు సిరీస్ నుంచి వైదొలిగాడు. పూర్తిగా కోలుకోవడానికి దాదాపు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.
భారత్-ఎ జట్టు:
తిలక్ వర్మ(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్(వైస్ కెప్టెన్), ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ బదోని, నిశాంత్ సింధు, సుర్యాంశ్ షెడ్గే, ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), కుమార్ కుషాగ్రా(వికెట్ కీపర్), విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్
ఇవి కూడా చదవండి:
ఇషాన్ కిషన్‌ను దాటి అత్యధిక ధర పలికిన ఎంఐ ప్లేయర్
ఐపీఎల్ ఫైనల్: కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..