ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్
ABN , Publish Date - Apr 25 , 2026 | 03:16 PM
ఐపీఎల్ 2026లో భాగంగా నేడు అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ నెగ్గిన ఢిల్లీ.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ తొలుత ఫీల్డింగ్ చేయనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ నెగ్గిన ఢిల్లీ.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ తొలుత ఫీల్డింగ్ చేయనుంది. అయితే ఈ సీజన్‌లో పంజాబ్.. అజేయంగా దూసుకెళ్తుంది. ఆడిన ఆరు మ్యాచుల్లో ఐదు గెలవగా.. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. 11 పాయింట్లతో పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆరు మ్యాచుల్లో మూడు గెలిచి 6 పాయింట్లతో ఢిల్లీ.. ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచులో కూడా పై చేయి ఎవరిదో చూడాల్సి ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
అక్షర్ పటేల్(కెప్టెన్), కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిశాంక, సమీర్ రిజ్వి, నితీశ్ రాణా, స్టబ్స్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, కుల్‌దీప్ యాదవ్, టి. నటరాజన్, ముకేశ్ కుమార్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: విప్రాజ్ నిగమ్, కరుణ్ నాయర్, చమీరా, అశుతోశ్ శర్మ, ఆకిబ్ నబీ దార్
పంజాబ్ కింగ్స్ తుది జట్టు
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), ప్రియాంశ్ ఆర్య, కూపర్ కానోలీ, శశాంక్ సింగ్, స్టోయినిస్, మార్కో యాన్సెన్, బార్ట్‌లెట్, విజయకుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: నేహాల్ వధేరా, హర్పీత్ బ్రార్, సుర్యాంశ్, యశ్ ఠాకూర్, విష్ణు వినోద్
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ
ఆ చెంపదెబ్బతో హర్భజన్‌కు రూ.కోటి ఆదాయం: శ్రీశాంత్