Share News

ఐపీఎల్ 2026: గ్రీన్ హాఫ్ సెంచరీ.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 181

ABN , Publish Date - Apr 17 , 2026 | 09:31 PM

ఐపీఎల్ 2026లో అత్యధిక ధర పలికిన ఆటగాడు కామెరూన్ గ్రీన్ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతోన్న మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది.

ఐపీఎల్ 2026: గ్రీన్ హాఫ్ సెంచరీ.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 181
KKR vs GT

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో అత్యధిక ధర పలికిన ఆటగాడు కామెరూన్ గ్రీన్ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతోన్న మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. జీటీకి 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచులో కామెరూన్ గ్రీన్(79; 55 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. గ్రీన్ మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు.


టిమ్ సీఫర్ట్(19), పావెల్(27), రమన్‌దీప్ సింగ్(17) మినహా మిగతా బ్యాటర్లతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అజింక్య రహానె(0), రఘువంశీ(8), అనుకుల్ రాయ్(9), రింకు సింగ్(1), సునీల్ నరైన్(0), కార్తిక్ త్యాగి(6) పరుగులు చేశారు. వైభవ్ అరోరా(0*) నాటౌట్‌గా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రబాడా 3, సిరాజ్ 2, అశోక్ శర్మ 2, ప్రసిద్ధ్ కృష్ణ 1, రషీద్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

డగౌట్‌లో ఫోన్ వాడకం.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు జరిమానా విధించిన బీసీసీఐ

గుజరాత్‌పై వరుణ్ చక్రవర్తి విజృంభణ చూస్తాం: కార్తిక్ త్యాగి

Updated Date - Apr 17 , 2026 | 09:31 PM