రహానెను తప్పించి సునీల్ నరైన్‌కు కెప్టెన్సీ ఇవ్వండి: క్రిస్ శ్రీకాంత్
ABN , Publish Date - Apr 17 , 2026 | 06:16 PM
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు కేకేఆర్ గెలుపు ఖాతానే తెరవలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్.. రహానె కెప్టెన్సీపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు కేకేఆర్ గెలుపు ఖాతానే తెరవలేదు. ఐదు మ్యాచ్‌లకు అన్నీ ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. దీంతో కేకేఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జట్టులో కామెరూన్ గ్రీన్, రింకు సింగ్, నరైన్, వరుణ్ చక్రవర్తి వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ జట్టు విజయాల బాట పట్టకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. జట్టు వ్యూహాలపై మాజీ క్రికెటర్లు కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్.. రహానె కెప్టెన్సీపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
‘రహానెకు ఇంకో ఒకటి లేదా రెండు అవకాశాలు ఇచ్చి చూడాలి. అయినా అతడిలో మార్పు కనిపించకపోతే అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలి. రహానె స్థానంలో సీనియర్ ప్లేయర్ సునీల్ నరైన్‌ను కెప్టెన్‌గా నియమించాలి. అప్పుడైనా జట్టు విజయాల బాట పడుతుంది. కెప్టెన్సీ పరంగానే కాదు బ్యాటింగ్‌లోనూ రహానె ప్రభావం చూపలేకపోతున్నాడు. జట్టుకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే బ్యాటింగ్‌కు వస్తే సరిపోతుంది. కేకేఆర్ జట్టు కూర్పు కూడా సరిగ్గా లేదు. ఫిన్ అలెన్, కామెరూన్ గ్రీన్ తీవ్రంగా విఫలమవుతున్నారు. వాళ్లిద్దరినీ తప్పించి రచిన్ రవీంద్ర, పతిరణలకు అవకాశం ఇవ్వాలి. ఓపెనింగ్‌లో రవీంద్రను పంపితే జట్టు సమతుల్యం మెరుగుపడుతుంది’ అని క్రిస్ వెల్లడించాడు.
రింకు హిట్టర్ కాదు..
కేకేఆర్ ఓటముల వేళ స్టార్ బ్యాటర్ రింకు సింగ్‌పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. క్రిస్ శ్రీకాంత్ కూడా అతడి బ్యాటింగ్ తీరుపై స్పందించాడు. ‘రింకు సింగ్ పెద్ద హిట్టరేమీ కాదు. చివరి ఓవర్లలోనే మాత్రమే అతడు రాణించగలడు. రన్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు రింకు సింగ్ ఆ ఒత్తిడిని తట్టుకోలేడు. కార్తిక్ త్యాగి మినహా ఇతర ప్లేయర్లు ఎవరూ అంతగా ప్రభావం చూపట్లేదు’ అని క్రిస్ శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.
ఇవి కూడా చదవండి:
డగౌట్‌లో ఫోన్ వాడకం.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు జరిమానా విధించిన బీసీసీఐ
గుజరాత్‌పై వరుణ్ చక్రవర్తి విజృంభణ చూస్తాం: కార్తిక్ త్యాగి