Share News

ఐపీఎల్ 2026: గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన కేకేఆర్

ABN , Publish Date - Apr 17 , 2026 | 07:16 PM

ఐపీఎల్ 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.

ఐపీఎల్ 2026: గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన కేకేఆర్
KKR vs GT

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత జీటీ ఫీల్డింగ్ చేయనుంది. కాగా కేకేఆర్ ఈ సీజన్‌లో ఇంకా గెలుపు ఖాతా తెరవని సంగతి తెలిసిందే. ఐదు మ్యాచుల్లో అన్నీ ఓడి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలతో కేకేఆర్ బరిలోకి దిగింది. మరోవైపు గుజరాత్.. 4 మ్యాచుల్లో 2 గెలిచి ఆరో స్థానంలో ఉంది.


కేకేఆర్ తుది జట్టు

టిమ్ సీఫర్ట్, సునీల్ నరైన్, అజింక్య రహానె(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, అంగ్‌క్రిష్ రఘువంశీ(వికెట్ కీపర్), పావెల్, రింకు సింగ్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: వరుణ్ చక్రవర్తి, ఫిన్ అలెన్, తేజస్వి దాహియా, నవదీప్ సైనీ, మనీశ్ పాండే


గుజరాత్ టైటాన్స్ తుది జట్టు

శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అశోక్ శర్మ, కగిసో రబాడా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: హోల్డర్, షారుఖ్ ఖాన్, మానవ్ సుతార్, కుల్వంత్, అనుజ్ రావత్


ఇవి కూడా చదవండి:

డగౌట్‌లో ఫోన్ వాడకం.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు జరిమానా విధించిన బీసీసీఐ

గుజరాత్‌పై వరుణ్ చక్రవర్తి విజృంభణ చూస్తాం: కార్తిక్ త్యాగి

Updated Date - Apr 17 , 2026 | 07:16 PM