ఐపీఎల్: ఒక సీజన్‌లో ఏ జట్టుకైనా హోమ్ గ్రౌండ్ ఒకటే ఉండాలి: అశ్విన్
ABN , Publish Date - Mar 23 , 2026 | 07:29 AM
ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ మ్యాచ్‌లను రెండు హోమ్ గ్రౌండ్ వేదికల్లో ఆడనున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28న ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ మ్యాచ్‌లను రెండు హోమ్ గ్రౌండ్ వేదికల్లో ఆడనున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. హోమ్ మ్యాచ్‌లను ఒక్క వేదికలో కాకుండా విభిన్న మైదానాల్లో నిర్వహించడం జట్టుకు పెద్ద నష్టమని అభిప్రాయపడ్డాడు.
‘ఒక జట్టు సీజన్ మొత్తాన్ని ఒకే హోమ్ గ్రౌండ్‌లో ఆడాలి. వేర్వేరు వేదికల్లో ఆడితే జట్టుకు అన్యాయం చేసినవారు అవుతారు. రవీంద్ర జడేజా, సామ్ కరన్ చేరడంతో జట్టు కూర్పు బాగుంది. కానీ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ లేకపోవడం వల్ల టైటిల్ అవకాశాలపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. నేను పంజాబ్ కింగ్స్(అప్పటి కింగ్స్ ఎలెవన్ పంజాబ్) జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఇండోర్‌తో పాటు మరో వేదికలో కూడా కొన్ని మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. ఆ సీజన్‌లో ఆఖరి వరకు పోరాడి బోల్తా పడ్డాం. దానికి హోమ్ గ్రౌండ్ కూడా ఓ కారణమే. సొంత మైదానం మారితే జట్టుపై ప్రభావం తప్పదు’ అని అశ్విన్ రాజస్థాన్ రాయల్స్‌ను హెచ్చరించాడు.
సుదీర్ఘ కాలంగా రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా సంజు శాంసన్.. ట్రేడ్ డీల్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్‌కు చేరిన సంగతి తెలిసిందే. సీఎస్కే నుంచి రవీంద్ర జడేజా ఆర్ఆర్‌కు వచ్చాడు. దీంతో రాజస్థాన్ జట్టును రియాన్ పరాగ్ నడిపించనున్నాడు. పరాగ్ నాయకత్వంలో రాయల్స్ జట్టు తొలి మూడు మ్యాచ్‌లు హోం గ్రౌండ్ గువాహటి వేదికగా ఆడనుంది. మిగతా మ్యాచ్‌లకు ఇతర మైదానం ఆతిథ్యమివ్వనుంది. ఇదిలా ఉండగా ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తన తొలి మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో మార్చి 30న గువాహటి వేదికగా ఆడనుంది.
ఇవి కూడా చదవండి:
ప్రేక్షకులు లేకుండానే పీఎస్ఎల్.. అభిమానులకు మొహ్సిన్ నఖ్వీ క్షమాపణలు
చార్టర్డ్ ఫ్లైట్ డిమాండ్.. విరాట్ రియాక్షన్ ఇదే!