Share News

ఖాళీ స్టేడియాల్లో పాక్‌ లీగ్‌

ABN , Publish Date - Mar 23 , 2026 | 06:44 AM

ఓవైపు అంతర్జాతీయ ఆటగాళ్లంతా ఐపీఎల్‌ వైపు మొగ్గు చూపుతుండగా.. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎ్‌సఎల్‌)లో కీలక మార్పులు చేశారు..

ఖాళీ స్టేడియాల్లో పాక్‌ లీగ్‌

రెండు వేదికల్లోనే మ్యాచ్‌లు

కరాచీ: ఓవైపు అంతర్జాతీయ ఆటగాళ్లంతా ఐపీఎల్‌ వైపు మొగ్గు చూపుతుండగా.. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎ్‌సఎల్‌)లో కీలక మార్పులు చేశారు. ఈనెల 26 నుంచి జరిగే లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు. అలాగే మ్యాచ్‌లన్నింటినీ కరాచీ, లాహోర్‌లో మాత్రమే ఆడించనున్నారు. గతంలో ఈ రెండింటితో పాటు ముల్తాన్‌, పెషావర్‌, ఫైసలాబాద్‌, రావల్పిండిలో మ్యాచ్‌లు జరిగేవి. కాగా ప్రారంభ వేడుకలను సైతం రద్దు చేశారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతుండగా, ఆర్థిక పొదుపు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు పాక్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ మొహిసిన్‌ నఖ్వీ తెలిపారు. పరిస్థితులు చక్కబడితే ప్రేక్షకుల్ని అనుమతించే అంశాన్ని పరిశీలిస్తారు. ప్రేక్షకులు లేనప్పుడు పలు వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించడంలో అర్ధంలేదన్నారు. కాగా పీఎ్‌సఎల్‌ను వీడి ఐపీఎల్‌లో చేరుతున్న ఆటగాళ్లపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని నఖ్వీ హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

ప్రేక్షకులు లేకుండానే పీఎస్ఎల్.. అభిమానులకు మొహ్సిన్ నఖ్వీ క్షమాపణలు

చార్టర్డ్ ఫ్లైట్ డిమాండ్.. విరాట్ రియాక్షన్ ఇదే!

Updated Date - Mar 23 , 2026 | 06:44 AM