Share News

మహిళల టీ20 ప్రపంచ కప్ 2026: భారత జట్టు ప్రకటన

ABN , Publish Date - May 02 , 2026 | 05:35 PM

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. తాజాగా దీని కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.

మహిళల టీ20 ప్రపంచ కప్ 2026: భారత జట్టు ప్రకటన
T20 World Cup

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీని కోసం బరిలోకి దిగే భారత మహిళా జట్టును శనివారం సెలక్టర్లు ప్రకటించారు. అమితా శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా, ప్రధాన కోచ్ అమోల్ మజుందార్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌లతో సమావేశమైంది. అనంతరం టీ20 ప్రపంచ కప్ 2026 టీమిండియా జట్టును ప్రకటించింది.


భారత జట్టు ఇదే..

హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మలి, దీప్తి శర్మ, రిచా ఘోష్(వికెట్ కీపర్), శ్రీచరణి, యాస్తికా భాటియా(వికెట్ కీపర్), నందినీ శర్మ, అరుంధతీ రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..

ఐపీఎల్‌లో అత్యధిక 'పీవోటీఎం' అవార్డులు అందుకున్న ప్లేయర్లు వీరే

Updated Date - May 02 , 2026 | 05:39 PM