Share News

కర్మన్‌ఘాట్ హనుమంతుడిని దర్శించుకున్న అభిషేక్ శర్మ

ABN , Publish Date - May 02 , 2026 | 05:04 PM

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించాడు. శనివారం స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశాడు. అతడికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను అభిషేక్ శర్మ.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

కర్మన్‌ఘాట్ హనుమంతుడిని దర్శించుకున్న అభిషేక్ శర్మ
Abhishek Sharma

ఇంటర్నెట్ డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించాడు. శనివారం స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశాడు. అతడికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను అభిషేక్ శర్మ.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో కూడా అతడు నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయాలను దర్శించుకున్నాడు. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఉప్పల్ వేదికగా తలపడనుంది. ఈ నేపథ్యంలో నగరానికి వచ్చిన అభిషేక్ శర్మ.. ప్రముఖ ఆలయాలను దర్శించుకుంటున్నాడు.


ఇదిలా ఉండగా, ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనలు చేస్తోంది. ఆడిన తొమ్మిది మ్యాచుల్లో ఆరు గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. టోర్నీ ఆరంభంలో కాస్త తడబడినప్పటికీ.. తిరిగి పుంజుకుని గత ఐదు మ్యాచుల్లో వరుసగా విజయాలు సాధించింది. కాగా అభిషేక్ శర్మ 9 మ్యాచుల్లో 425 పరుగులు చేశాడు. ఇందులో 40 ఫోర్లు, 31 సిక్స్‌లు ఉన్నాయి. ఈ సీజన్‌లో అభిషేక్.. ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు బాది అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తున్నాడు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..

ఐపీఎల్‌లో అత్యధిక 'పీవోటీఎం' అవార్డులు అందుకున్న ప్లేయర్లు వీరే

Updated Date - May 02 , 2026 | 05:16 PM