వెస్టిండీస్‌తో రెండో వన్డే: టాస్ నెగ్గిన భారత్.. జట్టులోకి కొత్త ప్లేయర్
ABN , Publish Date - Sep 30 , 2026 | 01:43 PM
గువాహటి వేదికగా భారత్-వెస్టిండీస్ జట్లు రెండో వన్డేలో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో విండీస్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఇంటర్నెట్ డెస్క్: గువాహటి వేదికగా భారత్-వెస్టిండీస్ జట్లు రెండో వన్డేలో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో విండీస్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. కాగా టీమిండియాలో ఆకిబ్ నబీ వన్డేల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో నబీని ఆడించనున్నట్లు గిల్ వెల్లడించాడు. కాగా తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో 1-0 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ పట్టేయాలని భారత్ పట్టుదలతో ఉంది.
భారత తుది జట్టు:
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), నమన్ ధీర్, రవీంద్ర జడేజా, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, కుల్‌దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ
వెస్టిండీస్ తుది జట్టు:
షై హోప్(కెప్టెన్, వికెట్ కీపర్), జాన్ కాంబెల్, కార్టీ, అమిర్ జాంగో, రుథర్‌ఫోర్డ్, రోస్టన్ చేస్, కీమో పాల్, జోసెఫ్, షమర్ జోసెఫ్, జేడెన్ సీల్స్, విటెల్ లాస్
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడలు: కాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు మరో స్వర్ణం
టీమిండియాకు కొత్త చీఫ్ సెలెక్టర్.. రేసులో మాజీ స్టార్ స్పిన్నర్!