కోహ్లీ టెస్టు రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకోవాలి: కపిల్ దేవ్
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:54 PM
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టు, టీ20 ఫార్మాట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కోహ్లీ టెస్టు రిటైర్‌మెంట్‌పై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టు, టీ20 ఫార్మాట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కోహ్లీ టెస్టు రిటైర్‌మెంట్‌పై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ఇప్పటికీ మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని.. మరో రెండు, మూడేళ్లు టెస్టు క్రికెట్ ఆడే సామర్థ్యం ఉందని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికైనా టెస్టు రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకోవాలని సూచించాడు. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో కోహ్లీ అజేయంగా 139 పరుగులు చేయడంపై కపిల్ స్పందిస్తూ.. అతడి ప్రస్తుత ఫిట్‌నెస్, ఫామ్‌ను ప్రశంసించాడు.
‘కోహ్లీ ఆడుతున్న విధానం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఈ వయసులో ఫిట్‌నెస్ అత్యంత కీలకం. అతడు మరో మూడేళ్లు తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోగలిగితే ఎన్నో రికార్డులు బద్దలు కొడతాడు. టెస్టు క్రికెట్‌కు కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించింనందుకు నాకు చాలా బాధగా అనిపిస్తుంటుంది. అతడు అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో కూడా తెలియదు. కానీ ఒక ప్రేక్షకుడిగా, మాజీ క్రికెటర్‌గా చెబుతున్నాను.. అతడు మరిన్ని టెస్టులు ఆడాల్సింది. అందుకు కావాల్సిన సామర్థ్యం అతడికి ఉంది. అతడి ఆటను ఇష్టపడే వ్యక్తిగా, ఆటను అంచనా వేయగల వ్యక్తిగా నేను అలా భావిస్తున్నాను’ అని కపిల్ వెల్లడించాడు.
భవిష్యత్‌లో బాధపడొచ్చు..
‘భవిష్యత్తులో కోహ్లీ కచ్చితంగా.. ‘నేను ఇంకెంత కాలం టెస్టు క్రికెట్ ఎందుకు ఆడలేదు?’ అని అనుకోవచ్చు. మీకు ఆటపై ప్రేమ, ప్యాషన్ ఉన్నప్పుడు.. మీ శరీరాన్ని మీరు మేనేజ్ చేసుకోగలిగితే ఎందుకు రిటైర్ అవ్వాలి? టీ20 క్రికెట్ వేరు. కానీ టెస్టు క్రికెట్ మాత్రం కోహ్లీకి బాగా సరిపోతుంది. అతడి వయసు 37 లేదా 38 ఏళ్లు ఉంటుందనుకుంటా. క్రికెట్‌లో అతడు ఇప్పుడు తాత లాంటివాడు. కాబట్టి మాలాంటి వాళ్లు అతడికి ఏది చేయాలో చెప్పడం సరికాదు. తనకు ఏది మంచిదో అతడికే తెలుసు. బయట వ్యక్తిగా నా అభిప్రాయం మాత్రం ఇదే.. అతడు మరికొంత టెస్టు క్రికెట్ ఆడాల్సింది. రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని మళ్లీ ఆడాలి. అయితే తుది నిర్ణయం మాత్రం అతడిదే’ అని కపిల్ దేవ్ స్పష్టం చేశాడు.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడలు: కాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు మరో స్వర్ణం
టీమిండియాకు కొత్త చీఫ్ సెలెక్టర్.. రేసులో మాజీ స్టార్ స్పిన్నర్!