Share News

న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. టాస్ నెగ్గిన టీమిండియా

ABN , Publish Date - Nov 07 , 2026 | 08:08 AM

వెల్లింగ్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు రెండో వన్డేలో తలపడనున్నాయి. టాస్ నెగ్గిన టీమిండియా.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. టాస్ నెగ్గిన టీమిండియా
India vs New Zealand

ఇంటర్నెట్ డెస్క్: వెల్లింగ్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు రెండో వన్డేలో తలపడనున్నాయి. టాస్ నెగ్గిన టీమిండియా.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. వర్షం తగ్గినప్పటికీ మైదానం చిత్తడిగా ఉండటంతో ఏడు గంటలకు పడాల్సిన టాస్ ఆలస్యమైంది. సమయం మించిపోవడంతో ఆటను అంపైర్లు 47 ఓవర్లకు కుదించారు. కాగా ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది.


భారత్ తుది జట్టు:

శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్


న్యూజిలాండ్ తుది జట్టు:

మిచెల్ శాంట్నర్(కెప్టెన్), విల్ యంగ్, టిమ్ సీఫర్ట్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, నాథన్ స్మిత్, జెమీసన్, డఫీ, బ్లెయిర్ టిక్నర్


ఈ వార్తలనూ చదవండి:

జోరు సాగనీ..

టెస్టులకు షమి వీడ్కోలు

Updated Date - Nov 07 , 2026 | 08:17 AM