Ind vs NZ: టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవరంటే?
ABN , Publish Date - Jan 11 , 2026 | 01:18 PM
భారత్-న్యూజిలాండ్ జట్లు మూడు వన్డేల సిరీస్ ఆడనున్నాయి. దీంట్లో భాగంగా వడోదర వేదికగా కాసేపట్లో తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్‌కి దిగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-న్యూజిలాండ్ జట్లు మూడు వన్డేల సిరీస్ ఆడనున్నాయి. దీంట్లో భాగంగా వడోదర వేదికగా కాసేపట్లో తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్‌కి దిగనుంది. వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఆడుతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. టెస్టు, టీ20 ఫార్మాట్లకు ఇప్పటికే వీడ్కోలు పలికిన రో-కో.. కేవలం వన్డేల్లోనే ఆడుతున్న విషయం తెలిసిందే. కాగా గాయం బారిన పడిన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు.
భారత తుది జట్టు:
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
న్యూజిలాండ్ తుది జట్టు:
డేవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్ వెల్(కెప్టెన్), జాక్‌ఫౌక్స్ క్లార్క్, జెమీసన్, ఆదిత్య అశోక్.
ఇవి కూడా చదవండి:
జట్టు నుంచి తప్పిస్తారనుకోలేదు.. అక్షర్ పటేల్ ఆవేదన
కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇచ్చిన కోహ్లీ.. ఎలాగంటే?