Viral: కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇచ్చిన కోహ్లీ.. ఎలాగంటే?
ABN , Publish Date - Jan 11 , 2026 | 10:02 AM
టీమిండియా-న్యూజిలాండ్ మధ్య నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఆటగాళ్లంతా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కొంత మంది చిన్నారులు వారిని చూడటానికి గ్రౌండ్‌కు వచ్చారు. ఆ యంగ్ కిడ్స్‌కు విరాట్ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. ఇక్కడే ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా-న్యూజిలాండ్ మధ్య నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో తొలి మ్యాచ్ వడోదర వేదికగా జరగనుంది. అయితే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. కేవలం వన్డేలు ఆడుతుండటంతో ఈ మ్యాచులపై అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఆటగాళ్లంతా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కొంత మంది చిన్నారులు వారిని చూడటానికి గ్రౌండ్‌కు వచ్చారు. ఆ యంగ్ కిడ్స్‌కు విరాట్(Virat Kohli) ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. ఇక్కడే ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.
ఆ చిన్నారుల్లో ఒక పిల్లాడు.. అచ్చు చిన్ననాటి కోహ్లీలాగే ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కోహ్లీ కూడా ఆ చిన్నారికి ఆటోగ్రాఫ్ ఇస్తూ.. చిరునవ్వు చిందిచడం అభిమానులను మరింత ఆకట్టుకుంటుంది. ‘వీడేంటి నా లాగే ఉన్నాడు..’ అని కోహ్లీ అనుకుని ఉంటాడని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి.
చారిత్రక వన్డే..
దాదాపు 15 ఏళ్ల తర్వాత వడోదరలోని కోటాంబి ఇంటర్నేషనల్ స్టేడియం పురుషుల వన్డేలకు ఆతిథ్యం ఇస్తుండటం విశేషం. ఇదే వేదికపై చివరి సారిగా 2010 డిసెంబర్ 4న భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ప్రస్తుత భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అద్భుత సెంచరీతో మెరిశారు.
రో-కో చెలరేగుతారా?
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగే ఈ తొలి మ్యాచ్‌పై కోహ్లీ, రోహిత్‌లపై అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. ఐపీఎల్, టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఇదే భారత జట్టు చివరి వన్డే సిరీస్ కావడంతో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శనపై అందరి దృష్టి ఉంది. ఇదిలా ఉండగా, టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోయినా.. శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌తో వన్డే కెప్టెన్‌గా మళ్లీ బాధ్యతలు చేపట్టనున్నాడు.
ఇవి కూడా చదవండి:
అరంగేట్రంలోనే అదరహో.. ఎవరీ అనుష్క శర్మ!
నేడే న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. టీమిండియా స్టార్ ప్లేయర్ దూరం!