Share News

WPL 2026: అరంగేట్రంలోనే అదరహో.. ఎవరీ అనుష్క శర్మ!

ABN , Publish Date - Jan 11 , 2026 | 07:18 AM

శనివారం గుజరాత్ జెయింట్స్-యూపీ వారియర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో గుజరాత్ తరఫున బరిలోకి దిగిన అనుష్క శర్మ.. తన అరంగేట్ర మ్యాచులోనే అదరగొట్టింది. అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ఆమె ప్రదర్శన చూసిన తర్వాత అభిమానులంతా ఆమె గురించి వెతకడం మొదలుపెట్టారు.

WPL 2026: అరంగేట్రంలోనే అదరహో.. ఎవరీ అనుష్క శర్మ!
Anushka Sharma

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్‌.. క్రీడాకారుల్లోని ప్రతిభని వెలికితీసి.. సరికొత్త ప్లేయర్లను క్రికెట్‌కు పరిచయం చేస్తుంది. శనివారం గుజరాత్ జెయింట్స్-యూపీ వారియర్స్(WPL 2026) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో గుజరాత్ తరఫున బరిలోకి దిగిన అనుష్క శర్మ.. తన అరంగేట్ర మ్యాచులోనే అదరగొట్టింది. అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ఆమె ప్రదర్శన చూసిన తర్వాత అభిమానులంతా ఆమె గురించి వెతకడం మొదలుపెట్టారు.


నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ బ్యాటర్ అనుష్క శర్మ(Anushka Sharma) తన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం 30 బంతుల్లోనే 7 ఫోర్ల సహాయంతో 44 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. 22 ఏళ్ల అనుష్క శర్మ కెప్టెన్ ఆష్లే గార్డనర్‌తో కలిసి మూడో వికెట్‌కు కేవలం 63 బంతుల్లోనే 103 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఒత్తిడిలో కూడా ఎంతో ప్రశాంతంగా ఆడుతూ, అంతర్జాతీయ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న తీరు క్రికెట్ విశ్లేషకులను ఆకట్టుకుంది.


వేలం నాటి నుంచే..

డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలం నాటి నుంచే అనుష్క శర్మ పేరు హాట్ టాపిక్‌గా మారింది. గుజరాత్ జెయింట్స్ ఆమెను రూ.45లక్షలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌ వేలంలో అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన అనుష్క.. అక్కడ దేశవాళీ టోర్నీల్లో అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది.


కెరీర్ ఇదే..

అనుష్క కుడిచేతి వాటం బ్యాటర్ మాత్రమే కాదు, రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలదు. సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీలో 207 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు తీసి ఆల్‌రౌండ్ సత్తా చాటింది.డొమెస్టిక్ వన్డేల్లో ఆమెకు 63 అత్యుత్తమ బ్యాటింగ్ యావరేజ్ ఉంది. మధ్యప్రదేశ్ జట్టుతో పాటు ఇండియా-బి, ఇండియా-సి, సెంట్రల్ జోన్ వంటి జట్ల తరఫున ఆడిన అనుభవం ఉంది.


ఇవి కూడా చదవండి:

సునామీని తలపించిన సూర్యవంశీ బ్యాటింగ్

కెమెరామెన్‌పై స్మృతి మందాన అసహనం.. వీడియో వైరల్

Updated Date - Jan 11 , 2026 | 07:45 AM