Ind Vs NZ: శ్రేయస్ ఆ విషయంలో తొందరపడకు.. మాజీ బ్యాటింగ్ కోచ్ సూచన
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:32 AM
టీమిండియా.. న్యూజిలాండ్‌తో వడోదర వేదికగా తొలి వన్డేలో నేటి నుంచి తలపడనుంది. అయితే గాయం బారిన పడిన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ఈ సిరీస్‌తో పునరాగమనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్.. అయ్యర్‌కు పలు జాగ్రత్తలు సూచించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా.. న్యూజిలాండ్‌తో వడోదర వేదికగా తొలి వన్డేలో తలపడనుంది. ఈ ఏడాది జరగనున్న తొలి వన్డే సిరీస్‌ను ఘనంగా ఆరంభించాలని గిల్ సేన చూస్తోంది. అయితే గాయం బారిన పడిన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ఈ సిరీస్‌తో పునరాగమనం చేస్తున్నాడు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్ కాగా.. అయ్యర్ వైస్ కెప్టెన్. దీంతో అతడికి ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. ఈ నేపథ్యంలో మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్(Sanjay Bangar).. అయ్యర్‌కు పలు జాగ్రత్తలు సూచించాడు.
‘ఇన్నింగ్స్‌ను మంచిగా ప్రారంభించి జట్టుకు వెంటనే సహకారం అందించాలనే తొందరలో ఉండొచ్చు. శ్రేయస్(Shreyas Iyer) ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే దేశవాళీ క్రికెట్‌లో రాణించి గొప్ప పునరాగమనం చేశాడు. అతడికి వన్డే క్రికెట్‌పై మంచి అవగాహన ఉంది. 2023 నుంచి అతడు స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ.. ఆడిన తీరు కనువిందుగా ఉంది. అతడి నైపుణ్యాలు చాలా ఉపయోగపడతాయి. గత సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్ స్పిన్ ఆట కారణంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు ఇదే స్థానంలో శ్రేయస్ ఆడనున్నాడు. దీంతో అతడి ఆట జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది’ అని బంగర్ వెల్లడించాడు.
మంచి వన్డే కెప్టెన్ అవుతాడు..
‘కెప్టెన్‌గా శుభ్‌మల్ గిల్‌పై ఇప్పుడే ఒక అంచనాకు రాలేము. అతడికి మైదానంలో సీనియర్ల నుంచి మద్దతు ఉంటుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అనుభవం అతడికి అందుబాటులో ఉంటుంది. అతడు క్రమంగా ఎదుగుతాడు. చివరికి మంచి వన్డే కెప్టెన్ అవుతాడు’ అని బంగర్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
జట్టు నుంచి తప్పిస్తారనుకోలేదు.. అక్షర్ పటేల్ ఆవేదన
కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇచ్చిన కోహ్లీ.. ఎలాగంటే?