ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో స్మృతి మంధాన
ABN , Publish Date - Mar 03 , 2026 | 08:03 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానాన్ని దక్కించుకుంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన జాబితాలో 790 పాయింట్లతో టాప్ స్పాట్‌లో నిలిచింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో స్మృతి ఓ హాఫ్ సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానాన్ని దక్కించుకుంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన జాబితాలో 790 పాయింట్లతో టాప్ స్పాట్‌లో నిలిచింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో స్మృతి ఓ హాఫ్ సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్(780)ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
వన్డే సిరీస్‌లో భారత్‌పై సెంచరీలు సాధించిన బెత్ మూనీ(749), అలీసా హీలీ(744) పైకి దూసుకొచ్చి ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. టీమిండియా బ్యాటర్లలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(652) 9వ స్థానంలో ఉండగా.. జెమీమా రోడ్రిగ్స్(635) 12వ స్థానానికి పరిమితమైంది. ఇగ బౌలింగ్ ర్యాంకింగ్స్ జాబితా విషయానికొస్తే.. ఇటీవల ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న స్టార్ బౌలర్ దీప్తి శర్మ(614) పదో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా ప్లేయర్ అలానా కింగ్(775) అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో సోఫీ ఎకిల్‌స్టన్(747), ఆష్లీ గార్డ్‌నర్(713) కొనసాగుతున్నారు.
టీ20 ర్యాంకింగ్స్‌లో..
ఐసీసీ విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో బెత్ మూనీ 787 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన 770 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. కాగా జెమీమా రోడ్రిగ్స్(644) 11వ స్థానం, హర్మన్ ప్రీత్ కౌర్(638) 15వ స్థానాల్లో కొనసాగుతున్నారు. టీ20 బౌలింగ్ జాబితాలో పాకిస్థాన్ ప్లేయర్ సాదియా ఇక్బాల్ 743 పాయింట్లతో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ తర్వాత స్థానాల్లో సదర్లాండ్(729), సూఫీ ఎకిల్‌స్టన్(727), దీప్తి శర్మ(717) ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ 2026: సెమీస్‌కు మ్యాచ్ రెఫరీలు వీరే!
కోహ్లీ ఎప్పటికీ ఆర్సీబీని వీడడు: మో బోబాట్