Share News

ఐపీఎల్ 2026: బెంగళూరులో ఐదు మ్యాచ్‌లు ఆడనున్న ఆర్సీబీ

ABN , Publish Date - Mar 03 , 2026 | 07:09 PM

ఆర్సీబీ ఫ్యాన్స్‌కు ఓ శుభవార్త. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ.. బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియం వేదికగా మ్యాచ్‌లు ఆడేందుకు రంగం సిద్ధమైంది. ఈ స్టేడియంలో ఐదు మ్యాచ్‌లు ఆడనున్నట్లు తాజాగా ఎక్స్ వేదికగా ప్రకటించింది.

ఐపీఎల్ 2026: బెంగళూరులో ఐదు మ్యాచ్‌లు ఆడనున్న ఆర్సీబీ
Royal Challengers Bengaluru

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఫ్యాన్స్‌కు ఓ శుభవార్త. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ.. బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియం వేదికగా మ్యాచ్‌లు ఆడేందుకు రంగం సిద్ధమైంది. ఈ స్టేడియంలో ఐదు మ్యాచ్‌లు ఆడనున్నట్లు తాజాగా ఎక్స్ వేదికగా ప్రకటించింది. మిగతా రెండు హోం మ్యాచ్‌లను రాయ్‌పుర్ వేదికగా ఆడనుంది. బెంగళూరులో మ్యాచ్‌లు నిర్వహించడానికి సహకరించిన కర్ణాటక ప్రభుత్వం, పోలీసులు, రాష్ట్ర క్రికెట్ సంఘానికి ఆర్సీబీ కృతజ్ఞతలు తెలిపింది.


18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2025 ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది. ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. చిన్నస్వామి స్డేడియం బయట ఆర్సీబీ నిర్వహించిన విక్టరీ పరేడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతులు ఇవ్వలేదు. ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్‌కు కూడా అనుమతి లేకపోవడంతో కర్ణాటకలోని హుబ్బళ్లిలో నిర్వహించారు. తాజాగా స్టేడియంలో భద్రతా ఏర్పాట్లు పూర్తి కావడంతో ప్రభుత్వం మ్యాచ్‌లను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉండగా మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్ 2026: సెమీస్‌కు మ్యాచ్ రెఫరీలు వీరే!

కోహ్లీ ఎప్పటికీ ఆర్సీబీని వీడడు: మో బోబాట్

Updated Date - Mar 03 , 2026 | 07:09 PM