జాతీయ గీతాన్ని ఆలపించడానికి నిరాకరించిన ఇరాన్ ఫుట్‌బాల్ ప్లేయర్లు
ABN , Publish Date - Mar 03 , 2026 | 05:28 PM
అంతర్జాతీయ వేదికపై ఇరాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు మైదానంలో జాతీయ గీతం ఆలపించే సమయంలో ఇరాన్ ప్లేయర్లు మౌనంగా ఉండిపోయారు. ఖమేనీ మృతికి నిరసనగా ప్లేయర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ వేదికపై ఇరాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు మైదానంలో జాతీయ గీతం ఆలపించే సమయంలో ఇరాన్ ప్లేయర్లు మౌనంగా ఉండిపోయారు. అమెరికా జరిపిన దాడుల్లో ఇటీవలే ఇరాన్ సుప్రీం లీడన్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతికి నిరసనగా ప్లేయర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా దక్షిణ కొరియాతో ఇరాన్ తలపడింది. ఈ మ్యాచ్‌కు ముందు ప్లేయర్లంతా మైదానంలో వరుసగా నిలబడ్డారు. ఇరాన్ జాతీయ గీతం ప్రసారం అయింది. కానీ జట్టు సభ్యులతో పాటు ప్రధాన కోచ్ మార్జియే జాఫరీ కూడా గీతాన్ని ఆలపించకుండా మౌనంగా నిలబడ్డారు. ఎటువంటి చలనం లేకుండా తమ నిరసనను వ్యక్తం చేశారు. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో ఇరాన్ కెప్టెన్ జహ్రా ఘన్బారి, కోచ్ జాఫరిని ఖమేనీ మరణంపై ప్రశ్నించగా.. ఏఎఫ్‌సీ ప్రతినిధి వెంటనే జోక్యం చేసుకుని ‘ఈ ప్రశ్నలు ఇక చాలు.. గేమ్‌పైనే దృష్టి పెట్టండి’ అని సమాధానం ఇచ్చారు.
మ్యాచ్ విషయానికొస్తే..
ఆసియాలోనే అత్యంత బలమైన జట్లలో ఒకటైన దక్షిణ కొరియాపై ఇరాన్ ఓటమి పాలైంది. కొరియా ప్లేయర్ చో యు-రి తొలి అర్ధభాగంలో గోల్ చేయగా.. విరామం తర్వాత కిమ్ హ్యెరి, కో యో జిన్ చెరో గోల్ సాధించి దక్షిణ కొరియాకు విజయాన్ని అందించారు. ఓటమి ఎదురైనా ఇరాన్ కోచ్ జాఫరీ తన జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశారు. ‘కొరియా ఆసియాలోనే బలమైన జట్టు. మాకు ఇది సవాలుతో కూడుకున్న మ్యాచ్ అని ముందే తెలుసు. రెండో అర్ధ భాగంలో మా వ్యూహాన్ని మార్చి ఒత్తిడి పెంచాం. అయితే పెనాల్టీ విషయంలో జరిగిన పొరపాటుతో పలు తప్పిదాల వల్ల మూల్యం చెల్లించుకున్నాం. అయినప్పటికీ మా జట్టు ఆత్మవిశ్వాసంతో ఆడింది’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ 2026: సెమీస్‌కు మ్యాచ్ రెఫరీలు వీరే!
కోహ్లీ ఎప్పటికీ ఆర్సీబీని వీడడు: మో బోబాట్