ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: రోహిత్ శర్మ జోరు.. అగ్రస్థానానికి అడుగు దూరంలో గిల్
ABN , Publish Date - Jul 22 , 2026 | 03:20 PM
వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది.ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ అనంతరం భారత బ్యాటర్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటారు. భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్(801) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ అనంతరం భారత బ్యాటర్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటారు. సిరీస్ కోల్పోయినప్పటికీ.. ర్యాంకింగ్స్‌లో మెరుగయ్యారు. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్(802) అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్(801) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా టాప్ ప్లేస్‌కు కేవలం ఒక్క పాయింట్ తేడాతోనే ఉండటం ఆసక్తికరంగా మారింది. టీమిండియా వెటరన్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ(767), రోహిత్ శర్మ(758) మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. అయితే టాప్ 5లో ముగ్గురు భారత బ్యాటర్లు ఉండటం విశేషం.
లార్డ్స్ వేదికగా రోహిత్ శర్మ(138) అద్భుత సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సూపర్ నాక్ తర్వాత రోహిత్.. 14 రేటింగ్ పాయింట్లు సాధించి నాలుగో స్థానానికి ఎగబాకాడు. గిల్, కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ భారత్‌తో వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో ఔట్ కాకుండా 249 పరుగులు చేశాడు. దీంతో నాలుగు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. బెన్ డకెట్ 11 స్థానాలు మెరుగుపరుచుకుని సంయుక్తంగా 19వ స్థానంలో నిలవగా, జాకబ్ బెథెల్ ఐదు స్థానాలు ఎగబాకి 64వ స్థానాన్ని దక్కించుకున్నాడు.
బౌలర్ల ర్యాంకింగ్స్‌లో..
బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మూడు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లతో సత్తా చాటాడు. దీంతో బౌలింగ్ వన్డే ర్యాంకింగ్స్‌లో 649 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకాడు. అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్(682) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్(675) రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రాణించిన అక్షర్ పటేల్ పది స్థానాలు ఎగబాకి 32వ స్థానానికి చేరుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్ విభాగంలో అఫ్గానిస్థాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్(316) అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. న్యూజిలాండ్ ప్లేయర్ బ్రేస్‌వెల్(259) మూడో స్థానానికి ఎగబాకాడు.
ఇవి కూడా చదవండి:
భారత్‌తో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించి జింబాబ్వే
అఫ్గానిస్థాన్ వన్డే కెప్టెన్ పదవికి హష్మతుల్లా షాహిది రాజీనామా