Share News

హాంకాంగ్ సిక్సెస్ 2026: భువీ ఔట్.. భారత కెప్టెన్‌గా ఆర్సీబీ స్టార్ ప్లేయర్

ABN , Publish Date - Oct 17 , 2026 | 04:15 PM

భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక కావడంతో హాంకాంగ్ సిక్సెస్-2026 టోర్నీకి అతడు దూరమయ్యాడు.

హాంకాంగ్ సిక్సెస్ 2026: భువీ ఔట్.. భారత కెప్టెన్‌గా ఆర్సీబీ స్టార్ ప్లేయర్
Bhuvneshwar Kumar

ఇంటర్నెట్ డెస్క్: భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక కావడంతో హాంకాంగ్ సిక్సెస్-2026 టోర్నీకి అతడు దూరమయ్యాడు. దీంతో ఈ టోర్నీలో భారత జట్టు కెప్టెన్సీ పగ్గాలను ఆర్సీబీ స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యకు అప్పగించారు. ఈ మేరకు క్రికెట్ హాంకాంగ్ ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే, భువీ స్థానంలో గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్ కుల్వంత్ ఖేజ్రోలియాకు జట్టులో చోటు కల్పించారు.


అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 1 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఆరుగురు ఆటగాళ్లతో కూడిన జట్ల మధ్య జరిగే ఈ పోటీల్లో భారత జట్టు బరిలోకి దిగనుంది. ఐపీఎల్‌లో అనుభవం ఉన్న ఆటగాళ్లు, విధ్వంసకర బ్యాటర్లు, ఆల్‌రౌండర్లతో జట్టును ఎంపిక చేశారు. హాంకాంగ్‌ సిక్సెస్‌ టోర్నీ కోసం ప్రకటించిన భారత జట్టులో కెప్టెన్‌ కృనాల్‌ పాండ్యతో పాటు శశాంక్‌ సింగ్‌, రాహుల్‌ తెవాటియా, నితీశ్‌ రాణా, రాహుల్‌ త్రిపాఠి, టి. నటరాజన్‌, కుల్వంత్‌ ఖేజ్రోలియా ఉన్నారు. ఈ ఫార్మాట్‌లో వేగంగా పరుగులు సాధించడంతో పాటు బౌలింగ్‌లోనూ రాణించగల ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇచ్చారు.


నాలుగేళ్ల తర్వాత..

న్యూజిలాండ్‌ పర్యటన కోసం భారత జట్టుకు ఎంపిక కావడం భువనేశ్వర్‌ కుమార్‌ కెరీర్‌లో కీలక పరిణామం. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత అతడికి జాతీయ జట్టులో అవకాశం లభించింది. అక్టోబర్‌ 22 నుంచి ప్రారంభమయ్యే న్యూజిలాండ్‌ పర్యటనలో భారత జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు. ఈ నేపథ్యంలో హాంకాంగ్‌ సిక్సెస్‌కు అతడు దూరం కావాల్సి వచ్చింది. భువనేశ్వర్‌ టోర్నీకి అందుబాటులో లేకపోవడం లోటేనని క్రికెట్‌ హాంకాంగ్‌ చైనా వాణిజ్య, మార్కెటింగ్‌ విభాగం డైరెక్టర్‌ అనురాగ్‌ భట్నాగర్‌ పేర్కొన్నారు. అయితే నాలుగేళ్ల తర్వాత భారత జట్టులోకి తిరిగి ఎంపిక కావడం సంతోషకరమని, న్యూజిలాండ్‌ పర్యటనలో అతడు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మళ్లీ హాంకాంగ్‌ సిక్సెస్‌లో భువీని స్వాగతిస్తామని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

ఢిల్లీ క్యాపిటల్స్.. కుల్‌దీప్ లాంటి స్పిన్నర్ మీకు మళ్లీ దొరుకుతాడా?: ఆకాశ్ చోప్రా

యశస్వికి అన్యాయం చేశారు.. సెలెక్టర్లపై అశ్విన్ ఫైర్!

Updated Date - Oct 17 , 2026 | 04:16 PM