Share News

ఐపీఎల్ 2026: సీఎస్కేతో కీలక పోరు.. టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్

ABN , Publish Date - Apr 26 , 2026 | 03:16 PM

ఐపీఎల్ 2026లో భాగంగా నేడు చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన జీటీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.

ఐపీఎల్ 2026: సీఎస్కేతో కీలక పోరు.. టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్
CSK vs GT

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన జీటీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. అయితే ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ జట్టును వీడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. టాస్‌కి రుతురాజ్ అందుబాటులోకి రావడంతో ఆ వార్తలకు చెక్ పడినట్లు అయింది. మరోవైపు ఈ మ్యాచ్‌లోనూ సీఎస్కే స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని బరిలోకి దిగలేదు. దీంతో మరోసారి అభిమానులకు నిరాశే మిగిలింది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. కాగా ఏడింట్లో మూడు గెలిచిన గుజరాత్.. ఏడో స్థానంలో కొనసాగుతోంది.


సీఎస్కే తుది జట్టు

రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), సంజు శాంసన్(వికెట్ కీపర్), ఉర్విల్ పటేల్, డేవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబె, కార్తిక్ శర్మ, జెమీ ఓవర్టన్, అకీల్ హుస్సేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జాప్‌నీత్ సింగ్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: సర్ఫరాజ్ ఖాన్, ముకేశ్ చౌదరి, ప్రశాంత్ వీర్, రామకృష్ణ ఘోష్, మ్యాథ్యూ షాట్


గుజరాత్ టైటాన్స్ తుది జట్టు

శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్(వికెట్ కీపర్), షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రబాడా, సిరాజ్, మానవ్ సుతార్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: రాహుల్ తెవాటియా, అనుజ్ రావత్, ఫిలిప్స్, కుల్వాత్, నిశాంత్ సింధు


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ప్యాట్ కమిన్స్ రీఎంట్రీ.. ఆర్ఆర్‌పై టాస్ నెగ్గిన సన్‌రైజర్స్

ఐపీఎల్ 2026: ఢిల్లీ బౌలర్ ఎంగిడికి తీవ్ర గాయం.. మైదానంలోకి అంబులెన్స్

Updated Date - Apr 26 , 2026 | 03:16 PM