Share News

కెప్టెన్సీ గురించి ఆలోచించను.. కమిన్స్ రావడం చాలా బలం: ఇషాన్ కిషన్

ABN , Publish Date - Apr 26 , 2026 | 01:40 PM

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్సీ మార్పు గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్ గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు. దీంతో ఇప్పటివరకు హైదరాబాద్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇషాన్ కిషన్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.

కెప్టెన్సీ గురించి ఆలోచించను.. కమిన్స్ రావడం చాలా బలం: ఇషాన్ కిషన్
Ishan Kishan viral comment

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్సీ మార్పు గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్ గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు. దీంతో ఇప్పటివరకు హైదరాబాద్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇషాన్ కిషన్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కమిన్స్ మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ బ్యాట్‌తో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌'గా నిలిచాడు (Ishan Kishan Captaincy).


మ్యాచ్ అనంతరం తన కెప్టెన్సీ గురించి, ప్యాట్ కమిన్స్ తిరిగి రావడం గురించి ఇషాన్ కిషన్ స్పందించాడు. 'ఏడు మ్యాచ్‌ల్లో జట్టుకు నాయకత్వం వహించడం చాలా సరదాగా అనిపించింది. కమిన్స్ జట్టులోకి రావడం మాకు అదనపు బలం. అతడు అద్భుతమైన కెప్టెన్. అతడు జట్టులోకి వస్తున్నప్పుడు నేను చాలా సంతోషించాను. నేను కెప్టెన్సీ కంటే నా బ్యాటింగ్, వికెట్ కీపింగ్ గురించే ఎక్కువగా ఆలోచిస్తాను` అని ఇషాన్ స్పష్టం చేశాడు (Pat Cummins SRH captain).


జట్టు కోసం తన పాత్ర మారదని, కెప్టెన్‌గా ఉన్నా లేకపోయినా తాను అదే విధంగా ఆడతానని ఇషాన్ కిషన్ చెప్పాడు (Cummins return IPL). శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 31 బంతుల్లో 74 పరుగులు చేసి జట్టుకు కీలక విజయం అందించాడు. అయితే ఇది తన బెస్ట్ ఇన్నింగ్స్ కాదని, తాను ఇంకా కెరీర్ ఉత్తమ ఇన్నింగ్స్ ఆడలేదని ఇషాన్ చెప్పాడు.


ఇవి కూడా చదవండి..

ఒక్క కోడిగుడ్డు ధర 2 లక్షల రియాల్స్.. ఇరాన్‌లో ధరల మోత..


ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Apr 26 , 2026 | 01:58 PM