Share News

ఐపీఎల్ 2026: ప్యాట్ కమిన్స్ రీఎంట్రీ.. ఆర్ఆర్‌పై టాస్ నెగ్గిన సన్‌రైజర్స్

ABN , Publish Date - Apr 25 , 2026 | 07:16 PM

ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఎస్ఆర్‌హెచ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్ఆర్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ సీజన్‌కు ముందు గాయం కారణంగా ఆటకు దూరమైన ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్, హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రీఎంట్రీ ఇచ్చాడు.

ఐపీఎల్ 2026: ప్యాట్ కమిన్స్ రీఎంట్రీ.. ఆర్ఆర్‌పై టాస్ నెగ్గిన సన్‌రైజర్స్
SRH vs RR

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఎస్ఆర్‌హెచ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్ఆర్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ సీజన్‌కు ముందు గాయం కారణంగా ఆటకు దూరమైన ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్, హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రీఎంట్రీ ఇచ్చాడు. కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. అతడి గైర్హాజరీలో ఇషాన్ కిషన్ ఎస్ఆర్‌హెచ్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న హైదరాబాద్.. రెట్టింపు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచుల్లో 4 గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఏడింట్లో ఐదు గెలిచి మూడో స్థానంలో కొనసాగుతోంది.


ఆర్ఆర్ తుది జట్టు

రియాన్ పరాగ్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), హిట్‌మేయర్, డొనొవాన్ ఫెర్రీరా, జడేజా, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, బర్గర్, బ్రిజేశ్ శర్మ

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: ప్రిటోరియస్, రవి బిష్ణోయ్, సందీప్ శర్మ, శుభమ్ దూబె


ఎస్ఆర్‌హెచ్ తుది జట్టు

ప్యాట్ కమిన్స్(కెప్టెన్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివాంగ్ కుమార్, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగ

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: స్మరన్ రవిచంద్రన్, లియామ్ లివింగ్‌స్టోన్, హర్ష్ దూబె, హర్షల్ పటేల్, ట్రావిస్ హెడ్


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: గాయం కారణంగా దూరం.. తిరిగి బరిలోకి దిగనున్న రోహిత్ శర్మ!

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్

Updated Date - Apr 25 , 2026 | 07:29 PM