Share News

ఐపీఎల్ 2026: కేఎల్ రాహుల్ అజేయ శతకం.. పంజాబ్ ముందు భారీ లక్ష్యం

ABN , Publish Date - Apr 25 , 2026 | 05:34 PM

సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసం సృష్టించింది. పంజాబ్ కింగ్స్‌పై జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు చెలరేగి ఆడారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 264 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఐపీఎల్ 2026: కేఎల్ రాహుల్ అజేయ శతకం.. పంజాబ్ ముందు భారీ లక్ష్యం
DC vs PBKS

ఇంటర్నెట్ డెస్క్: సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసం సృష్టించింది. పంజాబ్ కింగ్స్‌పై జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు చెలరేగి ఆడారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 264 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ కింగ్స్‌కు 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ భారీ శతకంతో బీభత్సం సృష్టించాడు. 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్సర్లతో ఏకంగా 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో బ్యాటర్ నితీశ్ రాణా తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 91 పరుగులు చేశాడు.


రాహుల్, నితీశ్ రాణా కలిసి రెండో వికెట్‌కు 95 బంతుల్లో ఏకంగా 220 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐపీఎల్‌లో ఇదే రెండో అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. మరోవైపు ఈ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్ చేసిన భారత ప్లేయర్‌గా రాహుల్ రికార్డ్ సృష్టించాడు. పాతుమ్ నిశాంక(11) విఫలమయ్యాడు. డేవిడ్ మిల్లర్(3*) నాటౌట్‌గా నిలిచాడు. ఢిల్లీ బ్యాటర్ల విధ్వంసాన్ని ఆపడానికి పంజాబ్ బౌలర్ల శక్తి సరిపోలేదు. ప్రపంచ మేటి బౌలర్లదందరూ పూర్తిగా చేతులెత్తేశారు. ప్రతి బౌలర్ 10కి పైగా ఎకానమీతో బౌలింగ్ చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు. అర్ష్‌దీప్ సింగ్, బార్ట్‌లెట్ తలొక వికెట్ తీశారు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: గాయం కారణంగా దూరం.. తిరిగి బరిలోకి దిగనున్న రోహిత్ శర్మ!

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్

Updated Date - Apr 25 , 2026 | 05:42 PM