Share News

విరాట్ ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు.. జీటీ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 25 , 2026 | 04:41 PM

ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనలు కనబరుస్తోంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గుజరాత్ అసిస్టెంట్ కోచ్ దహియా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడాడు.

విరాట్ ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు.. జీటీ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Vijay Dahiya

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనలు కనబరుస్తోంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆడిన ఏడింట్లో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. అయితే మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గుజరాత్ కోచ్‌కు విరాట్ కోహ్లీకి సంబంధించిన ప్రశ్నలే ఎదురయ్యాయి. ఎందుకంటే తొలి బంతికే కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను జీటీ ఫీల్డర్ వాషింగ్టన్ సుందర్ డ్రాప్ చేశాడు. ఆ తర్వాత విరాట్ 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్ విజయ్ దహియా ఈ విషయాలపై మాట్లాడాడు.


‘సుదీర్ఘ కాలంగా విరాట్ కోహ్లీ తన దూకుడును కొనసాగించడానికి కారణం అతడి మైండ్ సెట్. ఇప్పటికీ అదే ఎనర్జీతో ఉండటం అద్భుతం. ఆటపై అవగాహన, మంచి నైపుణ్యానికి తోడు ఉత్సాహం కలిసొస్తే ఎలా ఉంటుందో విరాట్‌ను చూస్తే అర్థమవుతుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీతో మాట్లాడా. అతడు చాలా నిరుత్సాహంగా ‘భారీ ఇన్నింగ్స్‌ను సెంచరీగా మార్చలేకపోయా’ అని బాధ పడ్డాడు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఇలాంటి ఎన్నో చేశావని చెప్పా. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడి.. క్లిష్టమైన పిచ్‌పై విరాట్ చాలా సులువుగా పరుగులు రాబట్టేశాడు. ఇలాంటి కమాండింగ్ ఇన్నింగ్స్‌తో ఎలాంటి బౌలర్లైనా గతి తప్పడం ఖాయం. ఎంతో అనుభవం ఉన్న విరాట్.. ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ నిన్నటి కంటే ఇవాళ మెరుగ్గా ఆడామా? లేదా? అనేదే కోహ్లీ ఆలోచిస్తాడు’ అని దహియా వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: గాయం కారణంగా దూరం.. తిరిగి బరిలోకి దిగనున్న రోహిత్ శర్మ!

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్

Updated Date - Apr 25 , 2026 | 04:42 PM