కోహ్లీ తర్వాత ఆ ట్యాగ్ అయ్యర్‌కే దక్కాలి: ఇర్ఫాన్ పఠాన్
ABN , Publish Date - Apr 26 , 2026 | 12:31 PM
ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై మాజీ భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లీ తర్వాత ఛేజ్ మాస్టర్ బిరుదుకు అర్హుడు అయ్యర్ మాత్రమేనని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై మాజీ భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లీ తర్వాత ఛేజ్ మాస్టర్ బిరుదుకు అర్హుడు అయ్యర్ మాత్రమేనని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం అని కొనియాడాడు (Shreyas Iyer chase master).
శనివారం జరిగిన మ్యాచ్‌లో అత్యంత ఒత్తిడి సమయంలో బరిలోకి దిగిన అయ్యర్ 36 బంతుల్లో మూడు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 71 పరుగులు చేసి పంజాబ్ జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు ఛేజింగ్‌ను పూర్తి చేసింది. తీవ్రమైన ఒత్తిడిలో కూడా అయ్యర్ ప్రశాంతంగా ఆడి మ్యాచ్‌ను ముగించడంపై క్రికెట్ నిపుణులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఇన్నింగ్స్‌పై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు ( Virat Kohli chase master).
'విరాట్ కోహ్లీ తర్వాత ఎవరికైనా ‘ఛేజ్ మాస్టర్’ ట్యాగ్ ఇవ్వాలంటే, అది శ్రేయస్ అయ్యర్‌కే సరిపోతుంది. ఒత్తిడిలో కూడా అతను ప్రశాంతంగా ఆడి జట్టును గెలిపిస్తాడు' అని పఠాన్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు (IPL 2026 Iyer form). ఇటీవలి కాలంలో ఐపీఎల్‌లో అయినా, భారత జట్టు తరఫున ఆడినా శ్రేయస్ ఛేజింగ్‌లో కీలకంగా మారుతున్నాడు. కీలక సమయాల్లో బాధ్యత తీసుకుని జట్టును గెలిపించడం అయ్యర్ ప్రత్యేకతగా మారింది.
ఇవి కూడా చదవండి..
ఒక్క కోడిగుడ్డు ధర 2 లక్షల రియాల్స్.. ఇరాన్‌లో ధరల మోత..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..