ధోని సంచలన నిర్ణయం.. ఫిట్‌గా ఉన్నప్పటికీ బరిలోకి దిగడానికి నిరాకరణ!
ABN , Publish Date - Apr 26 , 2026 | 02:41 PM
ఐపీఎల్ 2026లో భాగంగా మరికొద్దిసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. అయితే సీఎస్కే ఐకాన్ స్టార్ ఎంఎస్ ధోని తిరిగి బరిలోకి ఎప్పుడు దిగుతాడా? అని అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోని రీఎంట్రీపై ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా మరికొద్దిసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. అయితే సీఎస్కే ఐకాన్ స్టార్ ఎంఎస్ ధోని తిరిగి బరిలోకి ఎప్పుడు దిగుతాడా? అని అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోని రీఎంట్రీపై ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. పూర్తి ఫిట్‌నెస్ సాధించినప్పటికీ.. జట్టులోకి చేరడానికి ధోని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడున్న జట్టు కాంబినేషన్‌లో మార్పులు చేయకూడదనే ఉద్దేశంతోనే మిస్టర్ కూల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యువ ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వడానికి తన రీఎంట్రీని స్వయంగా వాయిదా వేసుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. మోకాలి గాయంతో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ధోని ఒక్క మ్యాచ్ కూడా ఆడని సంగతి తెలిసిందే.
మరోవైపు ధోని రీఎంట్రీపై సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హుస్సే స్పందించాడు. ‘ధోని తిరిగి వస్తే ‘ఇంపాక్ట్ ప్లేయర్‘గా బరిలోకి దిగే అవకాశాలు లేవు. సాధారణంగా వికెట్ కీపర్‌గానే ఆడతాడు. బ్యాటింగ్ పరంగా ధోని మంచి టచ్‌లో ఉన్నాడు. కానీ ఇన్నింగ్స్ చివర్లో వేగంగా పరుగులు తీయడానికి కావాల్సిన శారీరక స్థితిపై కాస్త ఆందోళనగా ఉంది. అన్నింటికీ సిద్ధంగా ఉన్నప్పుడే అతడు బరిలోకి దిగుతాడు’ అని హుస్సే వెల్లడించాడు.
కెప్టెన్సీపై సందిగ్ధత..
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ జట్టును వీడిన సంగతి తెలిసిందే. మరోవైపు ధోని కూడా ఆడేందుకు సుముఖంగా లేడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చెన్నైకి కెప్టెన్‌గా ఎవరుంటారనే అంశం చర్చనీయాంశమైంది. వీరిద్దరూ గుజరాత్‌తో మ్యాచ్‌కు అందుబాటులో లేకపోతే సంజు శాంసన్ జట్టు పగ్గాలు అందుకునే అవకాశం ఉంది. గతంలో రాజస్థాన్ రాయల్స్‌ను నడిపించిన అనుభవం సంజుకి ఉన్న సంగతి తెలిసిందే. బ్యాటర్‌గానూ శాంసన్ అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో రెండు సెంచరీలు నమోదు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇదిలా ఉండగా, ఆడిన ఏడు మ్యాచుల్లో 3 గెలిచిన సీఎస్కే.. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ప్యాట్ కమిన్స్ రీఎంట్రీ.. ఆర్ఆర్‌పై టాస్ నెగ్గిన సన్‌రైజర్స్
ఐపీఎల్ 2026: ఢిల్లీ బౌలర్ ఎంగిడికి తీవ్ర గాయం.. మైదానంలోకి అంబులెన్స్