Share News

ఐపీఎల్ 2026: 36 బంతుల్లోనే వైభవ్ సెంచరీ.. ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ ఎంతంటే?

ABN , Publish Date - Apr 25 , 2026 | 09:36 PM

ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్‌కు 229 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2026: 36 బంతుల్లోనే వైభవ్ సెంచరీ.. ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ ఎంతంటే?
RR vs SRH

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్‌కు 229 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆర్ఆర్ యువ సంచలనం వైభవ్ సూర్యంశీ సెంచరీతో చెలరేగాడు. 37 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో ఏకంగా 103 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో వైభవ్‌కు ఇది రెండో సెంచరీ. కాగా తన తొలి సెంచరీని 35 బంతుల్లో చేయగా.. ప్రస్తుతం 36 బంతుల్లోనే శతకం సాధించాడు.


ఆర్ఆర్ మరో బ్యాటర్ ధ్రువ్ జురెల్(51; 35 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించాడు. కాగా యశస్వి జైస్వాల్(10), రియాన్ పరాగ్(7), హిట్‌మేయర్(11) విఫలమయ్యారు. డొనొవాన్ ఫెర్రీరా(33) పర్వాలేదనపించాడు. రవీంద్ర జడేజా(4*), జోఫ్రా ఆర్చర్(2*) నాటౌట్‌గా నిలిచారు. హైదరాబాద్ బౌలర్లలో ఎషాన్ మలింగ 2, ప్రఫుల్ , ప్యాట్ కమిన్స్ 1, సాకిబ్ 1, నితీశ్ కుమార్ రెడ్డి 1 వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ప్యాట్ కమిన్స్ రీఎంట్రీ.. ఆర్ఆర్‌పై టాస్ నెగ్గిన సన్‌రైజర్స్

ఐపీఎల్ 2026: ఢిల్లీ బౌలర్ ఎంగిడికి తీవ్ర గాయం.. మైదానంలోకి అంబులెన్స్

Updated Date - Apr 25 , 2026 | 09:36 PM