Share News

ఐపీఎల్ 2026: చెపాక్‌లో చెన్నై చిత్తు.. గుజరాత్ టైటాన్స్ ఘన విజయం

ABN , Publish Date - Apr 26 , 2026 | 07:25 PM

చెన్నై సొంతగడ్డ చెపాక్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుతం చేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్.. కేవలం 2 వికెట్లు కోల్పోయి 16.4 ఓవర్లలోనే ఛేదించేసింది.

ఐపీఎల్ 2026: చెపాక్‌లో చెన్నై చిత్తు.. గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
GT vs CSK

ఇంటర్నెట్ డెస్క్: చెన్నై సొంతగడ్డ చెపాక్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుతం చేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్.. కేవలం 2 వికెట్లు కోల్పోయి 16.4 ఓవర్లలోనే ఛేదించేసింది. సాయి సుదర్శన్(87) హాఫ్ సెంచరీతో చెలరేగిన వేళ.. గుజరాత్ అలవోకగా గెలిచేసింది. చెన్నై బౌలర్లు, బ్యాటర్లు తీవ్రంగా విఫలమయ్యారు. అటు బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తే.. బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.


సాయి సుదర్శన్(87; 46 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. శుభ్‌మన్ గిల్(33; 23 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించాడు. బట్లర్(39*; 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్(1*) నాటౌట్‌గా నిలిచారు. చెన్నై బౌలర్లలో అకీల్ హుసేన్, నూర్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(74*) హాఫ్ సెంచరీ చేశాడు. సంజు శాంసన్(11), ఉర్విల్ పటేల్(4), సర్ఫరాజ్ ఖాన్(0), డేవాల్డ్ బ్రెవిస్(2), శివం దూబె(22), కార్తిక్ శర్మ(15), జెమీ ఓవర్టన్(18) వెనువెంటనే ఔటయ్యారు. అకీల్ హుసేన్(0*) నాటౌట్‌గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో రబాడా 3, అర్షద్ ఖాన్ 2, సిరాజ్ 1, మానవ్ సుతార్ 1 వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉండగా, 8 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ నాలుగింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరింది. మరోవైపు అన్నే మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే మూడింట్లో గెలిచి ఆరో స్థానంలో నిలిచింది.


ఇవి కూడా చదవండి:

అభిషేక్ శర్మ చేతిని లాగిన లేడీ ఫ్యాన్.. వీడియో వైరల్

ఐపీఎల్ 2026: సీఎస్కేతో కీలక పోరు.. టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్

Updated Date - Apr 26 , 2026 | 07:30 PM