Share News

ఐపీఎల్ 2026: కేకేఆర్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్

ABN , Publish Date - Apr 26 , 2026 | 07:13 PM

ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఎల్ఎస్‌జీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

ఐపీఎల్ 2026: కేకేఆర్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్
LSG vs KKR

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఎల్ఎస్‌జీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. అట్టడుగు స్థానంలో ఉన్న ఇరు జట్లకు ఈ పోరు అత్యంత కీలకం కానుంది. ఏడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకటే విజయం నమోదు చేసిన కేకేఆర్.. పదో స్థానంలో ఉంది. ఆడిన ఏడింట్లో రెండు గెలిచిన ఎల్ఎస్‌జీ.. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది.


ఎల్ఎస్‌జీ తుది జట్టు

రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), ఐడెన్ మార్క్‌రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుశ్ బదోని, ముకుల్ చౌదరి, జార్జ్ లిండే, షమి, ప్రిన్స్ యాదవ్, దిగ్వేశ్ రాఠి, మొహ్సిన్ ఖాన్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: హిమ్మత్ సింగ్, అక్షిత్ రఘువంశీ, అబ్దుల్ సమద్, ఆవేశ్ ఖాన్, మనిమారన్ సిద్ధార్థ్


కేకేఆర్ తుది జట్టు

అజింక్య రహానె(కెప్టెన్), టిమ్ సీఫర్ట్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, అంగ్‌క్రిష్ రఘువంశీ, పావెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: మనిశ్ పాండే, ఫిన్ అలెన్, తేజస్వి సింగ్, నవదీప్ సైనీ, వరుణ్ చక్రవర్తి


ఇవి కూడా చదవండి:

అభిషేక్ శర్మ చేతిని లాగిన లేడీ ఫ్యాన్.. వీడియో వైరల్

ఐపీఎల్ 2026: సీఎస్కేతో కీలక పోరు.. టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్

Updated Date - Apr 26 , 2026 | 07:13 PM