Share News

ఐపీఎల్ 2026: రుతురాజ్ హాఫ్ సెంచరీ.. గుజరాత్ ముందు స్వల్ప లక్ష్యం

ABN , Publish Date - Apr 26 , 2026 | 05:32 PM

ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. గుజరాత్‌కు 159 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2026: రుతురాజ్ హాఫ్ సెంచరీ.. గుజరాత్ ముందు స్వల్ప లక్ష్యం
CSK vs GT

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. గుజరాత్‌కు 159 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(74*) హాఫ్ సెంచరీ చేశాడు. అతడు మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లు పరుగులు ఇవ్వకుండా అద్భుతంగా కట్టడి చేశారు.


రుతురాజ్ గైక్వాడ్(74*; 60 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. సంజు శాంసన్(11), ఉర్విల్ పటేల్(4), సర్ఫరాజ్ ఖాన్(0), డేవాల్డ్ బ్రెవిస్(2), శివం దూబె(22), కార్తిక్ శర్మ(15), జెమీ ఓవర్టన్(18) వెనువెంటనే ఔటయ్యారు. అకీల్ హుసేన్(0*) నాటౌట్‌గా ఉన్నాడు. గుజరాత్ బౌలర్లలో రబాడా 3, అర్షద్ ఖాన్ 2, సిరాజ్ 1, మానవ్ సుతార్ 1 వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

అభిషేక్ శర్మ చేతిని లాగిన లేడీ ఫ్యాన్.. వీడియో వైరల్

ఐపీఎల్ 2026: సీఎస్కేతో కీలక పోరు.. టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్

Updated Date - Apr 26 , 2026 | 05:34 PM