Share News

వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం నా ఫేవరెట్ ప్లేయర్: ప్యాట్ కమిన్స్

ABN , Publish Date - Apr 26 , 2026 | 05:00 PM

ఐపీఎల్ 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చెలరేగి ఆడుతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఈ కుర్రాడు కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. అయితే మ్యాచ్ అనంతరం హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. వైభవ్ నాక్‌పై స్పందించాడు. అతడి ఆట తీరుకు ఫిదా అయ్యాయని తెలిపాడు.

వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం నా ఫేవరెట్ ప్లేయర్: ప్యాట్ కమిన్స్
Pat Cummins

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చెలరేగి ఆడుతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఈ కుర్రాడు కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. 15 ఏళ్ల వయసులో అరుదైన రికార్డులను బద్దలు కొడుతున్న వైభవ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎస్ఆర్‌హెచ్‌పై వైభవ్ సెంచరీ బాదినా రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. వైభవ్ నాక్‌పై స్పందించాడు. అతడి ఆట తీరుకు ఫిదా అయ్యాయని తెలిపాడు.


‘హై స్కోరింగ్ మ్యాచ్‌లో గెలవడం ఆనందంగా ఉంది. గాయం తర్వాత నేను ఆడిన తొలి మ్యాచ్ ఇది. ఎలా అవుతుందో? అన్న చిన్న సందేహం ఉండిపోయింది. కానీ మా కుర్రాళ్లు అద్భుతంగా ఆడారు. అయితే మ్యాచ్ ఓడినప్పటికీ వైభవ్ సూర్యవంశీని కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఇప్పుడు అతడే నా ఫెవరేట్ ప్లేయర్. వైభవ్ బంతిని చాలా బలంగా బాదేస్తున్నాడు. అతడు ఆడుతుంటే చాలా చూడముచ్చటేస్తుంది. బౌలర్ ఏ మాత్రం చిన్న పొరపాటు చేసినా.. వైభవ్ దాన్ని స్టాండ్స్‌లోకి పంపించేస్తున్నాడు. అతడి ఆట తీరు చాలా ఇంప్రెసివ్‌గా ఉంది’ అని కమిన్స్.. వైభవ్‌ను ప్రశంసించాడు.


మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 228 పరుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్‌కు 229 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వైభవ్ సూర్యవంశీ(103) సెంచరీ, ధ్రువ్ జురెల్(51) హాఫ్ సెంచరీతో చెలరేగారు. అయితే ఛేదనలో హైదరాబాద్ అద్భుతం చేసింది. అభిషేక్ శర్మ(57), ఇషాన్ కిషన్(74) హాఫ్ సెంచరీలు చేసి జట్టును గెలిపించారు. దీంతో హైదరాబాద్ జట్టు వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది.


ఇవి కూడా చదవండి:

అభిషేక్ శర్మ చేతిని లాగిన లేడీ ఫ్యాన్.. వీడియో వైరల్

ఐపీఎల్ 2026: సీఎస్కేతో కీలక పోరు.. టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్

Updated Date - Apr 26 , 2026 | 05:00 PM