ఐపీఎల్ 2026: సీఎస్కే ఇన్నింగ్స్ పూర్తి.. కోల్‌కతా నైట్ రైడర్స్ టార్గెట్ 193
ABN , Publish Date - Apr 14 , 2026 | 09:31 PM
ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. కేకేఆర్‌కు 193 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. కేకేఆర్‌కు 193 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. స్టార్ బ్యాటర్ సంజు శాంసన్(48) త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.
ఆయుశ్ మాత్రే(38; 17 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంత సేపు చెలరేగి ఆడాడు. గాయం బారిన పడి రీఎంట్రీ ఇచ్చిన డెవాల్డ్ బ్రెవిస్(41) రాణించాడు. సర్ఫరాజ్ ఖాన్(23) పర్వాలేదనిపించాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(7) మరోసారి నిరాశపర్చాడు. శివం దూబె(13*), జెమీ ఓవర్టన్(7*) నాటౌట్‌గా నిలిచారు. కోల్‌కతా బౌలర్లలో కార్తిక్ త్యాగి 2, సునీల్ నరైన్ 1, వైభవ్ అరోరా 1, అనుకుల్ రాయ్ 1 వికెట్ పడగొట్టారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పేలవ ఫామ్ ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. 3 ఓవర్లు వేసిన వరుణ్.. 26 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ సీజన్‌లో అత్యధిక ధర పలికిన కామెరూన్ గ్రీన్.. 2 ఓవర్లు వేసి 30 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు.
ఇవి కూడా చదవండి:
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ వల్లే ముంబైకి వరుస ఓటములు.. టీమిండియా మాజీ ప్లేయర్
కోహ్లీ తన స్థాయికి తగిన ప్రదర్శన చేయడం లేదు: మాజీ క్రికెటర్